మ్యూటెంట్ల మతలబులు

ABN , First Publish Date - 2021-07-13T05:30:00+05:30 IST

కొవిడ్‌ - 19 విజృంభించింది మొదలు ఇప్పటివరకూ తన రూపాలను మార్చుకుంటూనే ఉంది. డెల్టా

మ్యూటెంట్ల మతలబులు

కొవిడ్‌ - 19 విజృంభించింది మొదలు ఇప్పటివరకూ తన రూపాలను మార్చుకుంటూనే ఉంది. డెల్టా వేరియెంట్‌ మునుపటి కొవిడ్‌ వేరియెంట్‌ కంటే తీవ్రంగా ఉండి సెకండ్‌ వేవ్‌కు కారణమైంది. దీని తర్వాత వేరియెంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా డెల్టా ప్లస్‌ పేరు తెచ్చుకుంది. ఇవే కాకుండా తీవ్రంగా వ్యాప్తి చెందే తత్వం కలిగిన లంబాడా, కప్పా మొదలైన వేరియెంట్లు కూడా అడపా దడపా వెలుగుచూస్తున్నాయి. 


 డెల్టా వేరియెంట్‌: తీవ్రంగా వ్యాప్తి చెందే తత్వం కలిగిన వేరియెంట్‌ ఇది. ప్రారంభంలో వెలుగు చూసిన కరోనా వైరస్‌ లక్షణాలతో పోలిస్తే,  ఈ సెకండ్‌ వేవ్‌ వేరియెంట్‌ లక్షణాల తీవ్రత అధికం. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియెంట్‌ కంటే 8 రెట్లు తక్కువ సామర్ధ్యం కలిగి ఉంటాయి.


 


డెల్టా ప్లస్‌: మహారాష్ట్రలో వెలుగుచూసిన డెల్టా ప్లస్‌ థర్డ్‌ వేవ్‌కు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సాధారణ కరోనా లక్షణాలతో పాటు ఆకలి మందగించడం, తలతిరుగుడు, పొట్ట నొప్పి, వాంతులు లాంటి అరుదైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీర్ఘకాలంలో కీళ్ల నొప్పులు, వినికిడి శక్తి లోపాలు కూడా తలెత్తవచ్చు. 


 కప్పా: ఇది రెండు రకాల మ్యుటెంట్‌ స్ట్రెయిన్లతో తయారైంది. ఈ వైరస్‌ వ్యాధినిరోధకశక్తికి సంబంధించిన సహజసిద్ధ పోరాట వ్యవస్థను ఛిద్రం చేస్తుంది. దీనికున్న క్లిష్టమైన స్వభావాన్ని బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియెంట్‌కు ‘వేరియెంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ అని పేరు పెట్టింది. ఇది సహజసిద్ధ వ్యాధినిరోధక వ్యవస్థతో పాటు, వ్యాక్సిన్లతో పొందిన రక్షణను కూడా ఛేదించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. 


 లంబాడా: గత నాలుగు వారాల్లో ఈ వేరియెంట్‌ ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో వెలుగు చూసింది. ఇది కూడా రెండు వేర్వేరు వేరియెంట్ల కలయికతోనే రూపం సంతరిచడం విశేషం. 


Updated Date - 2021-07-13T05:30:00+05:30 IST