హిందువుల మనోభావాలను దెబ్బతీశారు

ABN , First Publish Date - 2021-05-08T08:51:13+05:30 IST

హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆంజనేయస్వామి జన్మస్థలాన్ని టీటీడీ ప్రకటించడం చట్ట విరుద్ధమని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సామాజిక కార్యకర్త బీకేఎ్‌సఆర్‌ అయ్యంగార్‌ పేర్కొన్నారు

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు

టీటీడీకి ‘పశ్చిమ’ సామాజిక కార్యకర్త నోటీసులు 


ఏలూరు క్రైం, మే 7: హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆంజనేయస్వామి జన్మస్థలాన్ని టీటీడీ ప్రకటించడం చట్ట విరుద్ధమని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సామాజిక కార్యకర్త బీకేఎ్‌సఆర్‌ అయ్యంగార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు తన న్యాయవాది సీఏపీఎస్‌ రామానుజాచార్యులు ద్వారా టీటీడీకి లీగల్‌ నోటీసులు పంపించారు. పురాణాలు, ఇతిహాసాలు, వాల్మీకి రామాయణం ప్రకారం హనుమ కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నది పక్కన పంపా సరోవరం దగ్గరలోని అంజనాద్రి(కిష్కంధ పర్వతం)పై జన్మించారని స్పష్టంగా ఉందన్నారు.   టీటీడీ కొంతమందితో కమిటీ ఏర్పాటు చేసి తిరుపతిలోని అంజనాద్రిపైనే ఆంజనేయస్వామి జన్మించారని ప్రకటించడం చట్ట విరుద్ధమన్నారు.  

Updated Date - 2021-05-08T08:51:13+05:30 IST