Advertisement
Advertisement
Abn logo
Advertisement

హోంగార్డుల సేవలు ప్రశంసనీయం

ఎస్పీ మలిక గర్గ్‌

ఒంగోలు(క్రైం)డిసెంబరు 6: పోలీసులకు దీటు గా హోంగార్డులు పనిచేస్తున్నారని ఎస్పీ మలికగర్గ్‌ పేర్కొన్నారు. సోమవారం హోంగార్డుల రైజింగ్‌ డే సందర్భంగా పోలీసు కా ర్యాలయం ఆవరణలో జరిగిన పరేడ్‌లో  ఎస్పీ పా ల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం హోంగార్డులను ఉద్దేశించి మాట్లాడారు. హోంగార్డుల సంక్షేమం కోసం అనేక పఽథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వాటిలో భాగంగానే కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ, డిజిటల్‌ గుర్తింపు కార్డులతో పాటుగా రెండురోజులు వేతనంతో సెలవులు తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.   

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి సంతాపసూచకంగా కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం పరెడ్‌ కమాండర్‌ జి.హనుమంతరావు, ప్లటూన్‌ కమాండర్లు సాంబనాయక్‌, క్రిష్ణయ్యలకు మె మెంటోలు అందజేశారు. అదే విధంగా హోం గార్డు రవి కి వెల్ఫేర్‌ ఫండ్‌ క్రింద ఐదువేల నగదు అందజేసారు. అదే విధంగా విధినిర్వహణలో మృతిచెందిన హోంగార్డు నాగయ్య భార్య కు ఐదు లక్షల పదివేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఓఎ్‌సడీ కె.చౌడేశ్వరి, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఆశోక్‌ బాబు, ఎస్బీ డీఎస్పీ మరియదాసు, డీఎస్పీలు శ్రీకాంత్‌, కిషోర్‌, శ్రీనివాసులు, జి.రామకృష్ణ, మల్లిఖార్జున్‌, ఆర్‌ఐలు శ్రీకాంత్‌నాయక్‌, హరిబాబు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement