కాలువలను కూల్చేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-01-18T05:44:15+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిజాంసాగర్‌ కాలువలకు భద్రత కరువవుతోంది. నిజాం కాలం నాటి కాలువలను ప లువురు కూల్చేస్తున్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టి ంచుకోవడం లేదు.

కాలువలను కూల్చేస్తున్నారు!
బండప్ప హనుమాన్‌ మందిర్‌ వద్ద నిజాంసాగర్‌ ప్రధాన కాలువ డ్రాప్‌ను కూల్చేసిన దృశ్యం

నిజాంసాగర్‌ కాలువల డ్రాప్‌ల కూల్చివేత

పట్టించుకోని నీటిపారుదల శాఖ అధికారులు

బోధన్‌, జనవరి 17: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిజాంసాగర్‌ కాలువలకు భద్రత కరువవుతోంది. నిజాం కాలం నాటి కాలువలను ప లువురు కూల్చేస్తున్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టి ంచుకోవడం లేదు. అప్పట్లో డంగు సున్నం, రాతి కట్టడాలతో నిర్మించిన కాలువలు, డ్రాప్‌లను జేసీబీలతో అడ్డగోలుగా కూ ల్చేస్తున్నా ఇరిగేషన్‌ అధికారులు కేసులు పెట్టేందుకు కూడా జంకుతున్నారు. తమ వద్ద సిబ్బంది లేరని, నిధులు లేవని, తామేమి చేయలేమని, తమేకేమి సంబంధం అన్నట్లుగా చే తులు దులుపుకొంటున్నారు. కాలువలు, డ్రాప్‌లు, ఇతర ని ర్మాణాలన్నీ వారసత్వ సంపదలని, నిజాంకాలంలో నిర్మించి న కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖ ల పైన ఉందని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఇరి గేషన్‌ అధికారులు మాత్రం తమ శాఖకు ఎలాంటి అధికా రాలు లేవని చేతులు దులుపుకొంటున్నారు.  

వారసత్వ సంపదకు  భద్రత కరువు

నిజాం రాజులు ఉమ్మడి జిల్లా రైతాంగం కోసం నిజాంసా గర్‌ ప్రాజెక్టును నిర్మించడంతోపాటు ప్రధాన డిస్ర్టిబ్యూటరీ లు, పిల్ల కాలువల ఏర్పాటు చేశారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో డీ-20, డీ-28, డీ-40లకు అత్యంత ప్రాధాన్యముంది. ఈ కాలువల పొడవునా వేలాది ఎకరాల భూములు ఉన్నా యి. అలాంటి కాలువలకు ప్రస్తుతం భద్రత కరువైంది. కొం దరు జేసీబీలను ఉపయోగించి ఎక్కడ పడితే అక్కడ నిజాం సాగర్‌ ప్రధాన కాలువలను డిస్ర్టిబ్యూటరీలను, పిల్ల కాలువ ల పైన డ్రాప్‌లను, ఇతర నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దిగువకు నీరు ఇలా వదలగానే అలా వచ్చేయాలన్న దురా లోచనలతో కొందరు రైతులు రెగ్యూలేటరీ సిస్టమ్‌ను కూల్చి వేస్తున్నారు. అడ్డగోలుగా యంత్రాలతో కూల్చివేతలు జరుపు తూ కాలువలకు ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపద అయి న నిజాంసాగర్‌ కాలువలు, డ్రాప్‌లు ఇతర నిర్మాణాలు లేకు ండా చేస్తున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవ హారాల పట్ల ఇరిగేషన్‌ అధికారులు సైతం కఠినంగా స్పం దించాల్సిన అవసరం ఉంది. 

పట్టింపు లేని ఇరిగేషన్‌ శాఖ

కాలువలపై పూర్తి స్థాయి హక్కులున్న ఏకైక శాఖ ఇరిగే షన్‌ శాఖ. చిన్నా చితక నిర్మాణాలు పక్కన పెడితే నిజాంసా గర్‌ ప్రధాన కాలువలు, రెగ్యూలేటర్‌ సిస్టమ్‌లు, డ్రాప్‌లు, ఇతర నిర్మాణాలను కాపాడాల్సిన భాద్యత ఇరిగేషన్‌ అధికా రుల పైనే ఉంది. అలాంటి ఇరిగేషన్‌ అధికారులు సిబ్బంది కొరత, నిధులు లేవంటూ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. కాలువలను కాపాడుకోవాల్సిన శాఖ అధికారులే చిన్న చిన్న అంశాలను సాకుగా చూపుతూ సొంత శాఖ ఆ స్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వారసత్వ సంపదకు కోల్పోయేలా చేస్తోంది. ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన ఆ స్తులపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం ఉన్నా, కూల్చివేతలు ఆక్ర మణలు జరిగినా ఇరిగేషన్‌ అధికారులు క్షేత్రస్థాయిలో స్పం దించకపోవడం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చే తులు దులుపుకొంటున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. కూల్చేసిన, ఆనవాళ్లు లేకుండా యంత్రాలతో కూల్చివేతలు చేసినా కనీసం పట్టింపు లేకపోవడం కేసులు పెట్టేందుకు వె నకాముందాడుతుండడం ఇరిగేషన్‌ శాఖలో నిర్లిప్తతను చె ప్పకనే చెబుతోంది. ఇకనైనా ఇరిగేషన్‌ కాలువలు, డ్రాప్‌లు, ఇతర వారసత్వ సంపదను ముట్టుకోవాలంటేనే జంకే విధం గా ఇరిగేషన్‌ అధికారులు వ్యవహరించకపోతే భవిష్యత్తులో భద్రత కరువయ్యే ప్రమాదం ఉంది.  

జైనపూర్‌ శివారులో డ్రాప్‌ల కూల్చివేత

కోటగిరి మండలంలోని జైనపూర్‌ శివారులో ఇటీవల డీ-20/1/2/2 కెనాల్‌ పరిధిలో మూడు నాలుగు డ్రాప్‌లు కూల్చివేయడం వివాదస్పదంగా మారింది. ప్రభుత్వ ఆస్తుల ను ప్రైవేటు వ్యక్తులు కూల్చివేయడంతో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్య వహారంలో ఇరిగేషన్‌ అధికారులు ఎలా వ్యవహరిస్తారన్నది చూడాలి. నిజాంసాగర్‌ ప్రధాన కాలువలు, డిస్ర్టిబ్యూటరీలు, రెగ్యూలేటరీలు, డ్రాప్‌ల కూల్చివేతలు జరుగుతున్న ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకపోవడం, కేసులు పెట్టకపోవ డం కూల్చివేతలను ప్రోత్సహించేలాగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజాంసాగర్‌ కాలువలను, డ్రాప్‌లను కాపాడాలని రైతులు కోరుతున్నారు. 

ఇరిగేషన్‌ ఆస్తులను ధ్వంసం చేస్తే కేసులు 

వెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌ ఈఈ, బోధన్‌

నిజాంసాగర్‌ కాలువలు, డ్రాప్‌లు ధ్వంసంపై ఇరిగేషన్‌ ఈఈ వెంకటేశ్వర్లను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ప్రైవేటు వ్యక్తులు ఇరిగేషన్‌ ఆస్తులను ధ్వంసం చేస్తే కేసులు తప్పవ ని హెచ్చరించారు. కోటగిరిలో జరిగిన ఘటనపై శాఖ పర మైన చర్యలు ఉంటాయన్నారు. ప్రైవేటు వ్యక్తులు ఇరిగేషన్‌ ఆస్తులను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని పోలీసులకు ఫి ర్యాదు చేస్తామన్నారు.  ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టి కి తేవాలని ఆయన సూచించారు. 

పోలీసులకు ఫిర్యాదు

కోటగిరి: మండల కేంద్రంలోని బండప్ప హనుమాన్‌ మ ందిరం సమీపంలో ధ్వంసమైన డీ-28/1/2 కాలువ డ్రాప్‌ల ను ఇరిగేషన్‌ డీఈ పావని, ఏఈ శృతి పరిశీలించి కోటగిరి ఎస్సై మశ్య్చేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తు లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వారి వెంట రైతులు గంగాధర్‌దేశాయ్‌, తెల్ల అరవింద్‌, మామిడి నవీన్‌, మామిడి శ్రీను, నార్ల సాయిశ్రీనివాస్‌, ఎడ్డెడి పోశెట్టి, ఎడ్డెడి గంగాధర్‌, ఎడ్డెడి గంగారం, పందిముక్కుల బుజ్జి, సా యిలు, మామిడి అశోక్‌, వేములపల్లి సత్యం, రమేష్‌, లింగం సాయిలు తదితరులున్నారు. 

Updated Date - 2021-01-18T05:44:15+05:30 IST