Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనుమానాస్పదస్థితిలో గొర్రెల కాపరి మృతి

ధర్మవరం, డిసెంబరు 6: పట్టణంలోని వైఎస్‌ఆర్‌ కాలనీలోని రైల్వేట్రాక్‌ సమీపంలో  గొర్రెల కాపరి ఆంజనేయులు (39) సోమ వారం అనుమానాస్పదస్థితిలో మృతిచెం దా డు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామా నికి చెందిన గొర్రెలకాపరి కురుబ ఆంజనే యులు ధర్మవరంలోని వైఎస్‌ఆర్‌ కాలనీ స మీపంలోని రైల్వేట్రాక్‌ పక్కన అనుమా నాస్ప దస్థితిలోపడి ఉన్నాడు. అతను మద్యం తాగినట్టు అక్కడ ఉన్న వాటర్‌ బాటిళ్లు, గ్లాసు, తినుబండారాలు కనిపిస్తున్నాయి. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలున్నారు. మ ద్యంతాగి మృతిచెందాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు విచా రణ చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.


Advertisement
Advertisement