పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

ABN , First Publish Date - 2021-10-18T03:41:16+05:30 IST

మండలంలోని వెల్మపల్లి గ్రామం లో ఆదివారం పిడుగుపాటుకు ముక్కెనబోయిన కోటేష్‌(20) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. వెల్మపల్లికి చెందిన లచ్చుమల్లు-రాజక్క కుటుంబం గొర్రెల పోషణపై జీవిస్తుం డగా వీరి రెండో కుమారుడు కోటేష్‌ గొర్రెలను మేతకని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. మధ్యా హ్నం ఓ చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తుండగా ఒక్క సారిగా ఉరుములు, మెరుపులతోపాటు అతనిపై పిడుగు పడడంతో కోటేష్‌ కుప్పకూలాడు.

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
కోటేష్‌ (ఫైల్‌)

కోటపల్లి, అక్టోబరు 17 : మండలంలోని వెల్మపల్లి గ్రామం లో ఆదివారం పిడుగుపాటుకు ముక్కెనబోయిన కోటేష్‌(20) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. వెల్మపల్లికి చెందిన లచ్చుమల్లు-రాజక్క కుటుంబం గొర్రెల పోషణపై జీవిస్తుం డగా వీరి రెండో కుమారుడు కోటేష్‌ గొర్రెలను మేతకని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. మధ్యా హ్నం ఓ చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తుండగా ఒక్క సారిగా ఉరుములు, మెరుపులతోపాటు అతనిపై పిడుగు పడడంతో కోటేష్‌ కుప్పకూలాడు. సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు గమనించి హుటాహుటిన చేరుకొని పరి శీలించగా అప్పటికే కోటేష్‌ మృతిచెందినట్లు స్ధానికులు తెలి పారు. కాగా ఘటన ప్రాంతంలో భోజనం చెల్లా చెదురుగా పడి ఉంది. భోజనం తినడం పూర్తయితే చెట్టు కింద నుంచే గొర్రెల వద్దకు వెళ్లేవాడని, దీంతో ప్రమాదం తప్పేదని స్ధానికులు తెలిపారు. కోటేష్‌ మృతి వార్త తెలియడంతో సర్పంచు సత్యనారాయణరావుతోపాటు గ్రామస్తులు  ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.   కోటేష్‌ మరణంతో  కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కలి చి వేసింది. అందరితో కలుపుగో లుగా ఉండే కోటేష్‌ పిడుగు పాటుకు గురై మృతిచెందడంతో వెల్మపల్లిలో విషాదం నెలకొంది. 

Updated Date - 2021-10-18T03:41:16+05:30 IST