కొండ దిగొస్తేనే సిగ్నల్‌!

ABN , First Publish Date - 2021-01-18T08:56:57+05:30 IST

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని దీనబంధుపురం, భరణికోట, వెంకటాపురం, ఇళాయిపురం పంచాయతీ పరిధిలో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలకు సెల్‌ సిగ్నల్స్‌ ఉండడంలేదు.

కొండ దిగొస్తేనే సిగ్నల్‌!

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని దీనబంధుపురం, భరణికోట, వెంకటాపురం, ఇళాయిపురం పంచాయతీ పరిధిలో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలకు సెల్‌ సిగ్నల్స్‌ ఉండడంలేదు.. దీంతో వలంటీర్లు లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లు, రేషన్‌ అందించలేకపోతున్నారు. సవరకుడ్డవలో సిగ్నల్‌ లేకపోవడంతో కిలోమీటరు దూరంలోని మెళియాపుట్టి-టెక్కలి ప్రధాన రహదారి వద్దకు లబ్ధిదారులను తీసుకొచ్చి వారి బయోమెట్రిక్‌ నమోదు చేయడానికి నానా తిప్పలూ పడుతున్నారు. ఇలా ఆదివారం ఉదయం ఓ వలంటీరు రేషన్‌లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకోవడం ‘ఆంధ్రజ్యోతి’ కెమెరాకు చిక్కింది. వారిని పలుకరిస్తే తమ సమస్యలను ఏకరువు పెట్టారు.      

 -మెళియాపుట్టి

Updated Date - 2021-01-18T08:56:57+05:30 IST