Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆయనో ప్రముఖ వైద్యుడు.. వైద్యం కోసం వచ్చే మహిళలే టార్గెట్.. 15మందితో శృంగారం.. చివరికి ఏమైందంటే..

వైద్యో నారాయణో హరీ.. అని పెద్దలు అన్నట్లు, వైద్యుడు దేవుడితో సమానం. అయితే ప్రస్తుతం కొందరు వైద్యులు మాత్రం వారి వృత్తికే కలంకం తెస్తున్నారు. అలాంటి వారి కారణంగా.. నేటి సమాజంలో వైద్యో నారాయణో హరీ అన్న నానుడి కాస్తా.. వైద్యుడి దగ్గరకు వెళ్తే ప్రాణాలు హరీ.. అంటాయని అనుకునే వరకు వచ్చింది. ప్రాణాలు పోవడం అటుంచితే.. కొందరు వైద్యుల వద్దకు వెళ్తే మానం కూడా పోతుందన్న పరిస్థితికి వచ్చింది. ఇటలీలో ఓ వైద్యుడు.. తన వద్దకు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇలా ఏకంగా 15మందితో రాసలీలలు సాగించేవాడు. చివరికి ఏమైందంటే..

ఇటలీకి చెందిన గియోవన్నీ వినియెల్లో(60) అనే వ్యక్తి, గైనగాలజిస్ట్‌గా పని చేసేవాడు. ఇతని వద్దకు మహిళలు వివిధ సమస్యలతో వచ్చేవారు. వారికి మంచి వైద్యం అందించి, వ్యాధులను దూరం చేయాల్సిన వైద్యుడు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవాడు. వైద్యం కోసం వచ్చే వారిని.. ఏవేవో పరీక్షలు చేయాలని రోజూ తిప్పుకొనేవాడు. ఆ సమయంలో తగలరాని చోట తగులుతూ తన వక్ర బుద్ధిని బయటపెట్టేవాడు. కొందరు మహిళలు బయటికి చెప్పుకోలేక.. అలాగే భరించేవారు. ఇంకొందరు మాత్రం అతడి మాయమాటలు నమ్మి, శృంగారం చేసేందుకు అంగీకరించేవారు. ఇలా ఏకంగా 15మంది మహిళలతో గుట్టుచప్పుడు కాకుండా రాసలీలలు సాగించేవాడు.

ఈ క్రమంలో ఇటీవల ఓ మహిళ.. చికిత్స నిమిత్తం అతడి వద్దకు వెళ్లింది. ఆమె పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. దీంతో చివరకు ఆమె ఓ టీవీ చానెల్ వారిని ఆశ్రయించింది. అంతా కలిసి స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. అనుకున్న ప్రకారం ఓ మహిళను వైద్యుడి వద్దకు పంపించారు. అతడికి తెలీకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరుసటి రోజు యథావిధిగా వెళ్లింది. పరీక్షలు చేస్తున్నట్లు నటిస్తూ.. అసభ్యంగా ప్రవర్తించాడు. తాను దుస్తులు  విప్పేసి, సదరు మహిళను కూడా దుస్తులు విప్పాలని చెప్పాడు. ఈ తంతు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. తర్వాత టీవీ చానెల్ వారు పోలీసులతో కలిసి లోపలికి ఎంటర్ అయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement