Viral News: ఆ చిన్న గుడిసె ధర రూ.36లక్షలు.. దానికి అంత డిమాండ్ ఎందుకో తెలుసా..?

ABN , First Publish Date - 2021-10-09T00:30:04+05:30 IST

చిన్న గుడిసెకు లక్షల్లో రేటు చెబితే ఎలా ఉంటుంది. అందులోనూ టాయిలెట్ లేని, కనీసం నీటి సౌకర్యం కూడా లేని గుడిసె. ఇలాంటి గుడిసెను కొనేవాళ్లు పిచ్చోళ్లా అని అనుకోవచ్చు.. కానీ ఇది నిజం. యూకేలోని వేల్స్‌ స్నోడోనియాలో ఓ గుడిసె లక్షల్లో రేటు పలుకుతోంది.

Viral News: ఆ చిన్న గుడిసె ధర రూ.36లక్షలు.. దానికి అంత డిమాండ్ ఎందుకో తెలుసా..?

ప్రాంతాన్ని బట్టి స్థలానికి విలువ ఉంటుంది. ఒక్కో చోట ధర ఒక్కోలా ఉంటుంది. పల్లెల్లో ఎకరా పొలం ధరతో.. నగరాల్లో సెంటు కూడా కొనలేం. కొన్ని సార్లు కొన్ని ప్రాంతాల్లో స్థలాలు, ఇళ్ల ధరలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరీ ఇంత రేట్ ఏంట్రా బాబూ.. డబ్బులేమన్నా చెట్టుకు కాస్తున్నాయా.. అనుకుంటాం. అలాంటిది చిన్న గుడిసెకు లక్షల్లో రేటు చెబితే ఎలా ఉంటుంది. అందులోనూ టాయిలెట్ లేని, కనీసం నీటి సౌకర్యం కూడా లేని గుడిసె. ఇలాంటి గుడిసెను కొనేవాళ్లు పిచ్చోళ్లా అని అనుకోవచ్చు.. కానీ ఇది నిజం. యూకేలోని వేల్స్‌ స్నోడోనియాలో ఓ గుడిసె లక్షల్లో రేటు పలుకుతోంది. వివరాల్లోకి వెళితే.. 


ఆ గుడిసెలో ఉండేందుకు పలువురు పోటీ పడుతున్నారు. మరి అందులో ఏవైనా సౌకర్యాలు ఉన్నాయా.. అంటే అదీ లేదు. కనీసం వాష్ రూం కూడా లేదు.. అయినా అక్కడ ఉండేందుకు సందర్శకులు పోటీ పడుతున్నారు. ఇందుకు ప్రధానం కారణం ఆ గుడిసె నుంచి చూస్తే సరస్సు, పర్వత శిఖరాల సహజ సౌందర్యం దర్శనమిస్తుంది. దీంతో ఆ చిన్న గుడిసె ధర.. మన కరెన్సీ ప్రకారం రూ.36 లక్షలు పలుకుతోంది.


గుడిసె లోపల కేవలం రెండు సోఫాలు మాత్రమే ఉంటాయి. అదనంగా ఓ బెడ్‌రూమ్ ఉంటుంది. అందులో అల్మారా, కుర్చీ, బెడ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే వారికి.. ఇది స్వర్గధామంగా ఉండడంతో కోనేందుకు పలువురు పోటీ పడుతున్నారట. ఈ గుడిసె ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2021-10-09T00:30:04+05:30 IST