మట్టిని కొల్లగొట్టేశారు

ABN , First Publish Date - 2021-06-14T05:57:25+05:30 IST

మంచాలకట్ట చెరువులో సారవంతమైన మట్టిని అక్రమార్కులు కొల్లగొట్టేశారు. భారీ వాహనాలతో యథేచ్ఛగా తరలించారు.

మట్టిని కొల్లగొట్టేశారు
మంచాలకట్ట చెరువులో మట్టి తవ్విన ప్రాంతం

  1. మంచాలకట్ట చెరువుతో అక్రమ తవ్వకాలు 


గడివేముల, జూన్‌ 13: మంచాలకట్ట చెరువులో సారవంతమైన మట్టిని అక్రమార్కులు కొల్లగొట్టేశారు. భారీ వాహనాలతో యథేచ్ఛగా తరలించారు. ఈ చెరువు కింద గడివేముల మండలంలోని గని, మంచాలకట్ట, మిడ్తూరు మండలంలోని తలముడిపి గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు మట్టి సారవంతంగా ఉండటంతో అక్రమార్కులకు దానిపై కన్ను పడింది. భారీ వాహనాలు, యంత్రాలు చెరువులో దింపి జోరుగా తవ్వకాలు జరిపారు. మట్టిని వ్యవసాయేతర పనుల కోసం నందికొట్కూరు నియోజకవర్గానికి తరలించారు.  


పట్టించుకోని అధికారులు 


చెరువులో మట్టి తవ్వకాలకు ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ కొందరు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారు. భారీ వాహనాలు గని గ్రామం మీద యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. 


అనుమతి ఇవ్వలేదు..


మంచాలకట్ట చెరువులో మట్టి తవ్వుకునేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. చెరువులో మట్టి తవ్వకాలపై విచారించి చర్యలు తీసుకుంటాం. 

- రాజశేఖర్‌, ఈఈ, నీటిపారుదలశాఖ 


చర్యలు తీసుకుంటాం..


మంచాలకట్ట చెరువులో అనుమతి లేకుండా తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో విచారించి తవ్వకాలు జరిపిన వారిపై కేసులు నమోదు చేస్తాం.                   

 - నాగమణి, తహసీల్దారు 

Updated Date - 2021-06-14T05:57:25+05:30 IST