Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

నిర్మల్‌ రూరల్‌, నవంబరు 29 : రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌ డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌తో సోమవారం నిర్మ ల్‌ మండలం తల్వేద గ్రామంలో బీజేపీ కృ ష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్‌ రావుల రాంనాథ్‌ ఎడ్లబండిపై ప్రయాణం చేసిన నిరసన వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ... ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లీటర్‌కు డీజిల్‌పై పది రూపాయలు, పెట్రోల్‌పై ఐదు రూపా యలు భారం తగ్గించి ప్రజలను ఆదుకోగా వారి మాటను శిరసావహించి దేశంలోని ఇర వై మూడు రాష్ర్టాలు వ్యాట్‌ను తగ్గించడం జరి గిందన్నారు. కానీ మనరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొండిగా వ్యవహరిస్తూ ప్రజలపై భారాన్ని తగ్గించకుండా నియంతలా వ్యవహరిస్తున్నాడు. కేసీఆర్‌ గత మే నెల నుండి నవంబరు వరకు లీటరుకు పెట్రో ల్‌పై 8.83, డీజిల్‌పై 5.68 రూపాయలు ప్రజలపై భారం వేసి ధరలు పెంచారన్నారు.  కానీ ఎటువంటి ధరలు పెంచలేదని ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తోకల అనిల్‌, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అయిండ్ల రమేష్‌, నాయకులు సాయన్న, శంకర్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement