Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలి

వనపర్తి రూరల్‌, నవంబరు 30: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ మండల అధ్యక్షుడు దేవేందర్‌ నాయుడు ఆధ్వర్యం లో  మంగళవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు  సామా న్య మానవుడికి పెనుభారంగా మారాయని, కేంద్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌ నుంచి ప్రధాని మోదీ డీజిల్‌పై రూ.10, పెట్రోట్‌పై ఐదు రూపాయలు తగ్గించారు. అదేవిధంగా దేశంలోని ఇరవై మూడు రాష్ర్టాలు కూడా వ్యాట్‌ తగ్గించి ఆ రాష్ట్ర ప్రజలకు భారం తగ్గించారు.  తెలంగాణ  ప్రభుత్వం మాత్రం ఒక లీటరుపై 33 రూపాయల వ్యాట్‌ను వసూలు చేసి రాష్ట్ర ప్రజల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా ఉండా లంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలని వినతిలో కోరినట్లు ఆయన తెలిపారు.  కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణ, సభ్యు డు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, వనపర్తి జిల్లా వైస్‌ ప్రెసి డెంట్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, బచ్చురాము, జిల్లా వాణిజ్య సెల్‌ కన్వీనర్‌ సూగూరు రాము, వనపర్తి టౌన్‌ జనరల్‌ సెక్రటరీ, జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు, తిరుమలేష్‌, బీజేవైఎం టౌన్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌ సాగర్‌, పట్టణ ఉపాధ్యక్షుడు వాకిటి సుదర్శన్‌, ఓబీసీ మోర్చా వనపర్తి మండల అధ్యక్షుడు రవి నాయక్‌, రమణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

పెద్దమందడిలో..

పెద్దమందడి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపు మేరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ తగ్గించాలని మంగళవారం మండలంలోని పెట్రోల్‌ బంక్‌ ముందు ఆటోలు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అ ధ్యక్షుడు రమేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించకపోవడం దారు ణమన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఆర్గనై జింగ్‌ సెక్రటరీ బుడ్డన్న, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, ఉపాధ్యక్షుడు సతీష్‌, మండల కార్యదర్శి శేఖర్‌, కిసాన్‌మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యు డు ఎన్‌.కృష్ణ, మండల కిసాన్‌ మోర్చా నా యకుడు వాకిటి రమేష్‌, రామ్‌ నరేష్‌, తిరుపతయ్య, కురు మూర్తి, శివ, విజయ్‌, ఆనంద్‌, రాజశేఖర్‌, బందన్న, ఆంజనేయులు, కృష్ణయ్య పాల్గొన్నారు.

గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట :మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద బీజేపీ నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌లపై వ్యాట్‌ తగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరవిం ద్‌, నారాయణ, వెంకటేష్‌, అశోక్‌ పాల్గొన్నారు. 

కొత్తకోటలో..

కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధర లపై వ్యాట్‌ తగ్గించాలని పట్టణంలో బీజేపీ నాయ కులు ఎడ్లబండ్లతో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు  వ్యాట్‌ చార్జీలు తగ్గించార న్నారు.  తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యాట్‌ చార్జీలు తగ్గించకుండా మొండిగా వ్యవహరిస్తోంద ని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు మన్యం యాదవ్‌, కొమ్ము సురేష్‌, రాఘవేందర్‌రెడ్డి, రాఘ వేందర్‌ గౌడ్‌, బాలు తదితరులు పాల్గొన్నారు. 

ఆత్మకూరులో..

  ఆత్మకూర్‌:  పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆత ్మకూర్‌  మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఎద్దుల బండిపై ప్రయాణిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాట్లాడుతూ  సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజల పై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే వ్యాట్‌ తగ్గించి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రిం చాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు నాగేంద్రంరెడ్డి, మండల అధ్యక్షు డు విష్ణువర్ధన్‌ రెడ్డి, నాయకులు శివ శంకర్‌, ఆనం ద్‌, ఎల్లన్న, ఎద్దుల రాజు, బోరెల్లిరాము, సమ్మద్‌, హరీష్‌, యశ్వంత్‌ నాయకులు పాల్గొన్నారు.  

పెద్దమందడిలో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు


Advertisement
Advertisement