Abn logo
May 7 2021 @ 04:28AM

రాష్ట్రానికి 6093 వైరస్‌ సోకింది: అయ్యన్న ఎద్దేవా

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఎ 1 వైరస్‌ 6093 సోకిందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. జైల్లో జగన్మోహన్‌ రెడ్డి సంఖ్యను గుర్తు  చేస్తూ గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. ఎన్‌ 440 కె కరోనా వైరస్‌ కర్నూలులో బయట పడిందని చెప్పి చంద్రబా బు రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నారని ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన  ప్రతిస్పందించారు. ‘‘దేశంలో వైరస్‌ ప్రమాదకరంగా ఉన్న 30 జిల్లాల్లో 7జిల్లాలు మన రాష్ట్రానివే. పాజిటివ్‌ రేటు 20 శాతం దాటిన రాష్ట్రాల్లో మనది 13వ రాష్ట్రం. క్రియాశీలక కేసులు బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆరోది. ఆయువు నిలబడటానికి వాయువు లేదు. వైద్యం అందించే నాథుడు లేడు. అంత్యక్రియలకు శ్మశానంలో ఖాళీ లేదు. మీ వైరస్‌ 6093 రాష్ట్రాన్ని శవాల దిబ్బగా మార్చేసింది’’ అని అయ్యన్న ట్వీట్‌ చేశారు.


మధ్యలో ఒక్క అక్షరమే తేడా: జవహర్‌

వైర్‌సకు... వైఎ్‌సకి మధ్యలో ఒక్క అక్షరమే తేడా అని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ట్విటర్‌లో... ‘‘వైర్‌సను ఇంటి పేరులో పెట్టుకొన్న జగన్‌ రెడ్డి వైఫల్యం వల్ల ఏపీలో వైరస్‌ విజృంభిస్తోంది. ఫ్యాక్షన్‌ వైరస్‌ రాజారెడ్డి, పొలిటికల్‌ వైరస్‌ రాజశేఖరరెడ్డి, అవినీతి వైరస్‌ జగన్‌రెడ్డి. ఈ వైర్‌సలు అన్నీ నారా వ్యాక్సిన్‌తోనే అంతం అవుతాయి’’ అని జవహర్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement