సీబీఐని రాష్ట్రాలు ఆపలేవు

ABN , First Publish Date - 2021-10-23T08:05:43+05:30 IST

‘‘సీబీఐ చేపట్టే దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోజాలవు. ఈ సంస్థ దర్యాప్తునకు అనుమతి ఇచ్చే విషయంలో రాష్ట్రాల అధికారం ....

సీబీఐని రాష్ట్రాలు ఆపలేవు

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, అక్టోబరు 22: ‘‘సీబీఐ చేపట్టే దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోజాలవు. ఈ సంస్థ దర్యాప్తునకు అనుమతి ఇచ్చే విషయంలో రాష్ట్రాల అధికారం పరిమితమే. దేశవ్యాప్త, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దర్యాప్తునకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు. వేర్వేరు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న కేసుల్లోనూ అనుమతులు అవసరం లేదు’’ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిం ది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత హింసకు సంబంధించి నమోదైన కేసుల్లో సీబీఐ దర్యాప్తు తీరు ను తప్పుబడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ శాఖ శుక్రవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. బెంగాల్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన అనుమతుల(జనరల్‌ కన్సెంట్‌)ను ఉపసంహరించుకోవడం సరికాదని పేర్కొంది. గతంలో అప్పటి కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై సీబీఐ కేసు విషయం లో కేంద్ర దర్యాప్తు సంస్థతో మమత సర్కారు ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించిన విషయం తెలిసిందే. తర్వాత ఆ రాష్ట్రంలో జనరల్‌ కన్సెంట్‌ను రద్దు చేస్తూ బెంగాల్‌ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సీబీఐ ప్రతి కేసుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడం అనివార్యంగా మారింది. దీన్ని కేంద్రం తన తాజా అఫిడవిట్‌లో తప్పుబట్టింది. 

Updated Date - 2021-10-23T08:05:43+05:30 IST