స్టీల్‌, సిమెంట్‌ కంపెనీల కుమ్మక్కు

ABN , First Publish Date - 2021-01-11T06:18:20+05:30 IST

స్టీల్‌, సిమెంట్‌ కంపెనీలపై కేంద్ర రహదారులు,రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా ధరలు పెంచేందుకు ఈ కంపెనీలు జట్టు (

స్టీల్‌, సిమెంట్‌ కంపెనీల కుమ్మక్కు

  • అడ్డగోలుగా ధరల పెంపు
  •  రెగ్యులేటరీ సంస్థ ఏర్పాటే మార్గం
  •  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ 


ముంబై: స్టీల్‌, సిమెంట్‌ కంపెనీలపై కేంద్ర రహదారులు,రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా ధరలు పెంచేందుకు ఈ కంపెనీలు జట్టు (కార్టెల్‌) కట్టాయని ఆరోపించారు. ఈ దందాకు చెక్‌ పెట్టేందుకు రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేయడమే మార్గమన్నారు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) సదస్సులో మాట్లాడుతూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల క్రితం కూడా ఒక సదస్సులో గడ్కరీ ఈ కంపెనీల ధరల పెంపు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 


ముమ్మాటికీ కుమ్మక్కే: ప్రధాని, ఆర్థిక మంత్రితో దీనిపై చర్చించినా.. సిమెంట్‌, స్టీల్‌ కంపెనీల ధరల పెం పు ఆగకపోవడంపై గడ్కరీ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచేందుకు ఈ కంపెనీలు ముమ్మాటికీ కూడబలుక్కుని కార్టెల్‌గా మారి, ఉత్పత్తి తగ్గించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు.


‘సిమెంట్‌, స్టీల్‌ రంగాలకు చెందిన పెద్ద కంపెనీలు కార్టెల్‌గా ఏర్పడ్డాయి. నిజంగా ఇది అందరికీ ఆందోళన కలిగించే అంశం’ అన్నా రు. గత ఏడాది జూలై నుంచి స్టీల్‌ కంపెనీలు ధరలు 55 నుంచి 60 శాతం వరకు పెంచేశాయి. సిమెంట్‌ ధర ప్రస్తుతం 50 కిలోల బస్తా రూ.380 నుంచి రూ.450 వరకు పలుకుతోంది. 


వాదన అర్థరహితం: ఇనుప ఖనిజం ధర పెరిగినందునే ధరలు పెంచాల్సి వ స్తోందన్న స్టీల్‌ కంపెనీల వాదనను గడ్కరీ తోసిపుచ్చారు. దేశంలోని ప్రధాన స్టీల్‌ కంపెనీలన్నింటికీ సొంత గనులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గత ఆర్నెల్లలో విద్యుత్‌, కార్మికుల వేతనాల్లోనూ ఎలాంటి మార్పు లేదన్నారు. అయినా కంపెనీలు కుమ్మక్కై  ధరలు పెంచేయడాన్ని తప్పుపట్టారు. 




లక్ష్యం కష్టమే: కంపెనీలు ఇలా అడ్డగోలుగా ధరలు పెంచుకుంటూ పోతే..భారత్‌ను ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ లక్ష్యం నెరవేరడం కష్టమవుతుందని గడ్కరీ స్పష్టం చేశారు.

వచ్చే ఐదేళ్లలో మౌలిక ప్రాజెక్టులపైనే ప్రభుత్వం రూ.111 లక్ష ల కోట్లు ఖర్చు చేయబోతున్న విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ధరలు పెంచేయడం దేశ ప్రయోజనాలకూ ఏ మాత్రం మంచిది కాదన్నారు. 


Updated Date - 2021-01-11T06:18:20+05:30 IST