ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి

ABN , First Publish Date - 2021-07-30T05:25:09+05:30 IST

పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచా లని, ఎట్టి పరిస్థితులలో ప్రైవేటీకరణ కానివ్వమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయ ణ అన్నారు.

ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న ఆదినారాయణ

కూర్మన్నపాలెం, జూలై 29: పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచా లని, ఎట్టి పరిస్థితులలో ప్రైవేటీకరణ కానివ్వమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయ ణ అన్నారు. కూర్మన్నపాలెంలో 168వ రోజు సెంటర్‌ప్లాంట్‌ విభాగం కార్మికులు పాల్గొన్న  రిలే నిరాహార దీక్షల శిబిరంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం వందశాతం వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా బీజేపీ యేతర రాజకీయ పక్షాలను కలసి మద్దతు కోరామని వివరించారు.  ఉక్కు కార్మికులు కొవిడ్‌ సమయం లోనూ ప్రాణాలను ఫణంగా పెట్టి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసి వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేశారన్నారు. కేంద్ర ఖజానాకు డివిడెండ్ల రూపంలో రూ.43 వేల కోట్లను ప్లాంట్‌ చెల్లించిందన్నారు. దేశంలోనే సముద్రతీర ప్రాంతంలో 20 మిలియన్‌ టన్నుల విస్తరణకు అనువైన భూమి కలిగిన ఉక్కు కర్మాగారాన్ని తాబేదార్లకు కట్టబెట్టాలని బీజేపీ యోచించడం నీచమైన చర్యన్నారు. బీజేపీ కుతంత్రాలను కార్మికుల ఉమ్మడి పోరాటాలతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కన్వీనర్లు కె.ఎస్‌.ఎన్‌.రావు, గంధం వెంకటరావు మాట్లాడుతూ ప్లాంట్‌ పరిరక్షణకు అన్ని పార్టీలు కలసి రావాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌, వరసాల శ్రీనివాసరావు,లింగేశ్వరరావు, మూర్తి, గంగవరం గోపి,  ప్రసాద్‌, రఘురామరాజు, కళ్యాణ చక్రవర్తి, దుర్గాప్రసాద్‌, బ్రహ్మయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T05:25:09+05:30 IST