స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి

ABN , First Publish Date - 2021-06-20T05:46:30+05:30 IST

ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ డిమాండ్‌ చేశారు

స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, జూన్‌ 19: ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ డిమాండ్‌ చేశారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 128వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో ఏఐటీయూసీ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ  పరిశ్రమల ప్రైవేటీకరణ అంశంలో  కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన ఉక్కు ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు గంధం వెంకటరావు, జె.రామకృష్ణ, కె.సత్యనారాయణ, ఎల్లేటి శ్రీనివాసరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, రాజబాబు, రామ కోటేశ్వరరావు, సీతారామ రాజు, బాబూరావు, దేముడు, జవహర్‌, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T05:46:30+05:30 IST