పొట్ట తగ్గాలంటే

ABN , First Publish Date - 2021-02-17T08:31:30+05:30 IST

వ్యాయామం, డైటింగ్‌ ద్వారా పొట్ట తగ్గించుకోవాలనుకుంటాం. అయితే వంటింట్లో లభించే ఉలవలతో ఏమంత కష్టపడకుండానే

పొట్ట తగ్గాలంటే

వ్యాయామం, డైటింగ్‌ ద్వారా పొట్ట తగ్గించుకోవాలనుకుంటాం. అయితే వంటింట్లో లభించే ఉలవలతో ఏమంత కష్టపడకుండానే పొట్ట తగ్గించుకోవచ్చు. ఉలవల జావ  పొట్ట తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అది ఎలాగంటే..


కావలసినవి: ఉలవలు-50 గ్రాములు, నీళ్లు పది రెట్లు, అల్లం-ఒక గ్రాము, జీలకర్రపొడి-ఒక గ్రాము, సైంధవ లవణం-రెండు గ్రాములు, మిరియాల పొడి-ఒక గ్రాము.  తయారీ:వీటన్నింటినీ కలిపి జావలా కాచి రోజూ సాయంత్రం తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గడమే కాదు, సాగిన పొట్ట సైతం దగ్గరకు వస్తుంది. 

Updated Date - 2021-02-17T08:31:30+05:30 IST