సినిమా చూసి కలలు కన్నాడు.. చివరకు ఆ విద్యార్థి వేసిన ప్లాన్ చూస్తే.. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు..!

ABN , First Publish Date - 2021-10-24T01:55:29+05:30 IST

అమీర్‌పేట్‌కు చెందిన రిత్విక్‌(25) అనే బిటెక్‌ విద్యార్థికి సినిమాలంటే పిచ్చి. రోజూ సినిమాలు చూసి.. అందులో మాదిరే ఏదోటి చేసి డబ్బు సంపాదించాలని అనుకునే వాడు. ఈ క్రమంలో ‘గాన్‌ ఇన్‌ సిక్స్‌టీ సెకన్స్‌’ అనే సినిమా చూసి ఓ నిర్ణయానికి వచ్చాడు.

సినిమా చూసి కలలు కన్నాడు.. చివరకు ఆ విద్యార్థి వేసిన ప్లాన్ చూస్తే.. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు..!

సినిమాల ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని డైరెక్టర్లు ప్రయత్నిస్తుంటారు. అయితే అవి చూసే కొందరు తెలివిపరులు మాత్రం.. అందులోని మంచిని తీసుకోకుండా చెడుకే ఎట్రాక్ట్ అవుతుంటారు. తద్వారా లేనిపోని సమస్యలు మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. సికింద్రాబాద్ పరిధి.. ఈస్ట్‌మారేడుపల్లిలో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సినిమాల్లో చేసినట్లుగానే చేశాడు, తద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేశాడు.. అయితే చివరకు మాత్రం జ్ఞానోదయం కలిగింది. వివరాల్లోకి వెళితే..


అమీర్‌పేట్‌కు చెందిన రిత్విక్‌(25) అనే బిటెక్‌ విద్యార్థికి సినిమాలంటే పిచ్చి. రోజూ సినిమాలు చూసి.. అందులో మాదిరే ఏదోటి చేసి డబ్బు సంపాదించాలని అనుకునే వాడు. ఈ క్రమంలో ‘గాన్‌ ఇన్‌ సిక్స్‌టీ సెకన్స్‌’ అనే సినిమా చూసి ఓ నిర్ణయానికి వచ్చాడు. అందులో కారును చోరీ చేసే సీన్‌ను గుర్తు పెట్టుకున్నాడు. అలాగే చేయాలని ప్లాన్ వేశాడు. ఈస్ట్‌మారేడుపల్లిలోని సెయింట్‌ జాన్స్‌ చర్చి వెనుకవైపు ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వైద్యురాలు పద్మావతి నివాసం ఉంటున్నారు. ఈ నెల 9న ఆమె కారును అపార్ట్‌మెంట్‌ వెనుక వైపు పార్కు చేసి ఉంది. సినిమాలో చూపినట్లుగా చేసి కారును తీసుకెళ్లాడు.


యజమాని ఫిర్యాదుతో తుకారాంగేట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శుక్రవారం మహేంద్రాహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటుగా వస్తున్న యువకుడిని ఆపి తనిఖీ చేయగా విషయం బయటపడింది. కారును చోరీ చేసిన అనంతరం స్నేహితులతో జల్సాలు చేసినట్లు ఒప్పుకొన్నాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.

Updated Date - 2021-10-24T01:55:29+05:30 IST