యుకేలో గుంటూరు యువకుడి విజయం

ABN , First Publish Date - 2021-05-09T09:06:01+05:30 IST

గుంటూరు జిల్లాకు చెందిన ముమ్మలనేని అరుణ్‌ యుకేలోని హ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బేజింగ్‌స్టోక్‌ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచారు

యుకేలో గుంటూరు యువకుడి విజయం

అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కౌన్సిలర్‌గా ఎన్నిక 

బేజింగ్‌ స్టోక్‌ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి గెలుపొందిన తొలి తెలుగోడు 


గుంటూరు, మే 8(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాకు చెందిన ముమ్మలనేని అరుణ్‌ యుకేలోని హ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బేజింగ్‌స్టోక్‌ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచారు. ఆరవ తేదీన అక్కడ ఎన్నికలు జరిగాయి. 7న వెలువడ్డ ఫలితాల్లో కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. అత్యధిక కౌన్సిలర్లు గెలుపొందిన ఈ పార్టీయే అధికారంలోకి రానుంది. ఆయా నియోజకవర్గాల నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు లీడర్‌ ఆఫ్‌ ద హౌస్‌ను ఎన్నుకోనున్నారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి ప్రప్రథమంగా ఒక తెలుగువాడు కౌన్సిలర్‌గా గెలుపొందటం విశేషం. ఈ పదవిలో నాలుగేళ్ళ పాటు ఆయన కొనసాగుతారు. 45 ఏళ్ల ముమ్మలనేని అరుణ్‌ పుట్టింది రేపల్లె నియోజకవర్గంలోని మైనేనివారిపాలెంలో. అయితే అమృతలూరు మండలం మోపర్రులోని అమ్మమ్మ ఇంటి వద్దే ఆయన పెరిగారు. అరుణ్‌ తండ్రి వెంకటరావు ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌. ప్రస్తుతం డిఫెన్స్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న అరుణ్‌... సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందుకుగాను 2017లో ప్రధాని చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. 2019లో బెస్ట్‌ వలంటీర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు, 2021లో కరోనా వేళ అందించిన సేవలకు విశేష పురస్కారం పొందారు. 

Updated Date - 2021-05-09T09:06:01+05:30 IST