చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి

ABN , First Publish Date - 2022-01-21T06:03:23+05:30 IST

తెలంగాణలో మూతపడ్డ మూడు చక్కెర ఫ్యాక్టరీలను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చోరవ తీసుకోని వెంటనే తె రిపించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు.

చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- చక్కెర ఫ్యాక్టరీపై ఎంపీ వ్యాఖ్యలు విడ్డురం

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

 మెట్‌పల్లి, జనవరి 20: తెలంగాణలో మూతపడ్డ మూడు చక్కెర ఫ్యాక్టరీలను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చోరవ తీసుకోని వెంటనే తె రిపించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. గురువారం పట్టణంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న చక్కె ర ఫ్యాక్టరీని సందర్శించిన నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ చక్కెర ఫ్యాక్టరీ పై చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఎంతో మంది రైతుల కు ఉపాధిని ఇచ్చే చక్కెర ఫ్యాక్టరీని తనకు అప్పగిస్తే నడిపిస్తానని అ నడం విడ్డూరంగా ఉందన్నారు. చక్కెర ఫ్యాక్టరీ వ్యాపారం కాదని ప్రజ లకు సేవ చేస్తావని ఓట్లు వేస్తే దానిని వ్యాపారం చేస్తున్నాడని విమ ర్శించారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. అదే విధంగా రైతులు పండి స్తున్న ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కోనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి బండ శంకర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు అల్లూరి మహేంధర్‌రెడ్డి, నాయకులు అందె మారు తి, లక్ష్మణ్‌, కొంతం రాజం, బాబన్న నసీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T06:03:23+05:30 IST