ముందే వచ్చిన వేసవి!

ABN , First Publish Date - 2021-03-03T09:33:36+05:30 IST

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎముకలు కొరికే చలి మాయమై మాడుపగిలే ఎండలు కాస్తున్నాయి. ఈ ఏడాది దేశంలో తక్కువ రోజుల

ముందే వచ్చిన వేసవి!

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎముకలు కొరికే చలి మాయమై మాడుపగిలే ఎండలు కాస్తున్నాయి. ఈ ఏడాది దేశంలో తక్కువ రోజుల వ్యవధిలోనే చలికాలం పోయి ముందే వేసవి రావడంపై వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరగడానికి వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ల ప్రభావం పెద్దగా లేకపోవడమే కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిసెంబరు నుంచి ఫిబ్రవరి/మార్చి వరకు వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ల ప్రభావంతో ఉత్తర, వాయువ్య భారతాల్లో వర్షాలు కురుస్తాయి. అటువంటిది ఈ ఏడాది వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ల ప్రభావం పెద్దగా లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.


దీంతో నేల పొడిబారి తేమ ప్రభావం తగ్గింది. శీతల గాలులు కూడా తగ్గడంతో ఒక్కసారిగా భూమి వేడెక్కి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. హిమాలయాల్లో వర్షాలు లేకపోవడం కూడా ఒక కారణమని భారత వాతావరణ శాఖ నిపుణుడొకరు విశ్లేషించారు. ప్రీమాన్‌సూన్‌ వర్షాలు ప్రారంభమయ్యేంత వరకు దేశంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-03-03T09:33:36+05:30 IST