ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా వేగవంతంగా చేయాలి

ABN , First Publish Date - 2021-05-11T06:00:23+05:30 IST

జిల్లాలో గల ఆక్సిజన్‌ రీఫి ల్లింగ్‌ ఏజెన్సీల ద్వారా ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా వేగవంతంగా జరగాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అన్నారు.

ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా వేగవంతంగా చేయాలి
ఆక్సిజన్‌ రిఫిల్లింగ్‌ ఏజెన్సీలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె శశాంక

జిల్లా కలెక్టర్‌ కె శశాంక 


కరీంనగర్‌, మే 10 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): జిల్లాలో గల ఆక్సిజన్‌ రీఫి ల్లింగ్‌ ఏజెన్సీల ద్వారా ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా వేగవంతంగా జరగాలని జిల్లా కలెక్టర్‌ కె శశాంక అన్నారు. సోమవారం మానకొండూర్‌ మండలం ఖాదర్‌గూడెంలో గల బృందావనం ఆక్సీజన్‌ రీఫిల్లింగ్‌ ఏజెన్సీ ని, ఉజ్వల పార్కు వద్ద గల సిద్ధివినాయక ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ ఏజెన్సీలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కరోనా విజృంభి స్తున్నం దున ఎక్కువ మంది రోగులకు ఆసుపత్రు లలో ఆక్సిజన్‌ అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం కరో నా విజృంభణ సమయంలో జిల్లాలో ఆక్సి జన్‌ కొరత రాకుండా తగిన చర్యలు తీసు కోవాలన్నారు. ఆక్సీజన్‌ ఫిల్లింగ్‌ ప్లాంట్‌ లలో అదనపు సిబ్బందిని నియమిం చుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఆక్సీజన్‌ ప్లాంట్‌లో ఏమైనా మిషన్‌ చెడిపోతే వెంటనే రిపేర్‌ చేయుటకు వీలుగా పార్ట్స్‌ ముందుగానే తెప్పించుకొని నిల్వ ఉంచుకోవాలని సూచించారు. జిల్లాకు వచ్చే లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ ఎక్కడ రవాణాలో ఆలస్యం జరగకుండా తెప్పించుకో వాల న్నారు. జిల్లాకు వచ్చిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ను వెంటనే రీఫిల్లింగ్‌ చేసి అవసరమైన ఆసుపత్రులకు త్వరగా పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నోడల్‌ ఆఫీసర్‌ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నవీన్‌కుమార్‌, మానకొండూర్‌ తహసీల్దార్‌ రాజయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T06:00:23+05:30 IST