కరాటేలో పలువురు విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-10-25T04:19:46+05:30 IST

ఇంటర్నేషనల్‌ జపాన్‌ కరాటే డూ కాయ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్‌ వైడ్‌ ఆన్‌లైన్‌ ఈ కాటా ఛాంపియన్‌షిప్‌-2021 పోటీల్లో గజ్వేల్‌కు చెందిన విద్యార్థులు సంజయ్‌, అతిక్‌, మధుప్రియ, నరసింహ, సృజన్‌ బంగారు పతకం, అమృతవర్షిణి వెండి పతకం, విఘ్నేష్‌, మనోహర్‌ కాంస్య పతకాలను సాధించారు.

కరాటేలో పలువురు విద్యార్థుల ప్రతిభ
విద్యార్థులను అభినందిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి

గజ్వేల్‌, అక్టోబరు 24 : ఇంటర్నేషనల్‌ జపాన్‌ కరాటే డూ కాయ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్‌ వైడ్‌ ఆన్‌లైన్‌ ఈ కాటా ఛాంపియన్‌షిప్‌-2021 పోటీల్లో గజ్వేల్‌కు చెందిన విద్యార్థులు సంజయ్‌, అతిక్‌, మధుప్రియ, నరసింహ, సృజన్‌ బంగారు పతకం, అమృతవర్షిణి వెండి పతకం, విఘ్నేష్‌, మనోహర్‌ కాంస్య పతకాలను సాధించారు. అలాగే గ్రేడింగ్‌ టెస్ట్‌లో నరసింహ, మనోహర్‌, శ్రావ్య ఎల్లో బెల్ట్‌, ఆకాంక్షిత, సాయి, విద్యా స్వరూపిణి, అమృతవర్షిణి, సహస్ర ఆరెంజ్‌ బెల్ట్‌లు సాధించారు. కాగా వీరిని ఆదివారం గజ్వేల్‌ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి ఆధ్వర్యంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్‌, మల్లేశం, శ్రీనివాస్‌, ఎన్‌.సంతోష్‌, అజ్గర్‌, ప్రవీన్‌, సాయి, విష్ణువర్ధన్‌, కరాటే సెక్రటరీ నరేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T04:19:46+05:30 IST