Abn logo
Oct 22 2021 @ 00:00AM

ప్రపంచంలోనే ఎతైన మహిళ

ఆరడుగుల ఎత్తున్న మనిషిని చూస్తే మంచి హైట్‌ అని అంటుంటాం. మరి ఏడడుగుల ఎత్తు ఉన్న వ్యక్తి తారసపడితే...! అంత ఎత్తు ఉన్న మనిషి ఉన్నారా అని సందేహమా? అయితే మీరు రుమేసా గురించి తెలుసుకోవాల్సిందే.


  1. టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా ఎత్తు 7 అడుగులపైనే! ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా ఈమె గుర్తింపు పొందింది. సాధారణంగా మనుషులు ఇంత ఎత్తు పెరగడం జరగదు. అయితే జెనెటిక్‌ డిజార్డర్‌ మూలంగా రుమేసా ఇలా ఏడడుగుల ఒక అంగుళం ఎత్తు పెరిగింది. 
  2.  రుమేసా ప్రస్తుతం ఈ ఎత్తు వల్ల శారీరక సమస్యలను ఎదుర్కొంటోంది. వాకింగ్‌ ఫ్రేమ్‌ సహాయంతో తప్ప నడవలేదు. ఎక్కువగా వీల్‌చైర్‌లోనే తిరుగుతూ ఉంటుంది. 
  3. రుమేసా పేరు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోనూ ఎక్కింది. ప్రపంచంలో బతికి ఉన్న ఎత్తైన మహిళగా ఆమె పేరును నమోదు చేశారు.

ప్రత్యేకం మరిన్ని...