టేకు కలప వేలం ద్వారా భారీగా ప్రభుత్వానికి ఆదాయం లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-20T05:13:42+05:30 IST

టేకు కలప వేలం ద్వారా ఈ ఏడాది ప్రభుత్వానికి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చేలా కృషి చేస్తున్నట్టు నర్సీపట్నం డీఎఫ్‌వో సీహెచ్‌.సూర్యనారాయణపడాల్‌ తెలిపారు.

టేకు కలప వేలం ద్వారా భారీగా ప్రభుత్వానికి ఆదాయం లక్ష్యం
టేకు కలప వేలాన్ని పరిశీలిస్తున్న డీఎఫ్‌వో


 గొలుగొండ, జూన్‌ 19 : టేకు కలప వేలం ద్వారా ఈ ఏడాది ప్రభుత్వానికి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చేలా కృషి చేస్తున్నట్టు నర్సీపట్నం డీఎఫ్‌వో సీహెచ్‌.సూర్యనారాయణపడాల్‌ తెలిపారు.   గొలుగొండ కలప డిపోలో శనివారం టేకు కలపకు నిర్వహిస్తున్న వేలం ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు.  డివిజన్‌లోని లోతుగెడ్డ, గొలుగొండ, సీలేరు, నర్సీపట్నం గ్రామాల్లో కలప డిపోలు ఉన్నాయన్నారు. ఆయా డిపోల ద్వారా గత ఏడాది సుమారు రూ.మూడు కోట్లు ఆదాయం సమకూరినట్టు చెప్పారు.  కొయ్యూరు మండలం నల్లొండలో నాలుగు టేకు ప్లాంటేషన్లలో ఒక ప్లాంటేషన్‌లో చెట్లను తొలగిస్తున్నామన్నారు.  ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కలప వేలం నత్తనడకన సాగుతుందన్నారు. అంతేకాకుండా చెట్లను తొలగించేందుకు కూలీల కొరత కూడా ఏర్పడిందని వివరించారు. సబ్‌ డీఎఫ్‌వో రెడ్డి, డిపో ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:13:42+05:30 IST