భానుడి భగభగ

ABN , First Publish Date - 2020-05-24T10:23:17+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ జిల్లాలో జిల్లాలో శనివారం 44.3 డిగ్రీల

భానుడి భగభగ

నిప్పుల కొలిమిలా భద్రాద్రి జిల్లా  

44.3డిగ్రీలకు చేరిన ఉష్ణొగ్రత


కొత్తగూడెం, మే 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ జిల్లాలో జిల్లాలో శనివారం 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది పూర్తిగా పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన ఈ జిల్లాలో ఏటా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఉదయం 7 గంటలకే సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా వడగాడ్పులు సైతం పెరగడంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడిపోతున్నారు. సింగరేణి ప్రాంతంలో ఓపెన్‌ కాస్ట్‌ గనుల వద్ద 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఓసీల్లో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది.


కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట పట్టణాల్లో మధ్యాహ్నం వేళ జనం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకే షాపులు తెరిచి ఉంటుండడంతో మధ్యం ఎండ తీవ్రతకు జనం బయటకు రాలేకపోతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలోనే దుకాణాలకు వెళుతున్నారు. ఈ నెల 25 నుంచి రోహిణికార్తె ప్రారంభమవుతుండడంతో ఎండలు మరింత పెరిగే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

Updated Date - 2020-05-24T10:23:17+05:30 IST