చోరీని ఛేదించారు..

ABN , First Publish Date - 2021-10-14T05:14:06+05:30 IST

ఆభరణాల చోరీ కేసులో నిందితుడు విజయనగరం మండలం గొల్లలపేట గ్రామానికి చెందిన కొయ్య అప్పలరాజును అరెస్టు చేసి 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు విజయ నగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌ బుధవారం తెలిపారు.

చోరీని ఛేదించారు..
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అనిల్‌కుమార్‌

  8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం  

 ఒకరి అరెస్టు

విజయనగరం క్రైం, అక్టోబరు 13: ఆభరణాల చోరీ కేసులో నిందితుడు విజయనగరం మండలం గొల్లలపేట గ్రామానికి చెందిన కొయ్య అప్పలరాజును అరెస్టు చేసి 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు విజయ నగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌ బుధవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లలపేటలో నివాసం ఉంటున్న బొట్ట బంగారమ్మ ఈ నెల 5న విజయనగరం వెళ్లగా అదే ప్రాంతానికి చెందిన కొయ్య అప్పలరాజు ఆమె బయటకు వెళ్లడాన్ని గుర్తించి ఆమె ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాను తెరిచి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యాడు. తిరిగి వచ్చాక ఆమె విజయనగరం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న అనుమానితుల గురించి తెలుసుకున్నారు. ఈ నెల 10న అప్పలరాజు పుస్తుల తాడు అమ్మడానికి పట్టుకుని వెళ్తుండ గా పోలీసులు జొన్నవలస జంక్షన్‌ వద్ద మాటు వేసి పట్టుకుని స్టేషన్‌కి తరలించారు. అక్కడ విచారించగా నేరం చేసినట్టు అంగీక రించాడు. నిందితు డ్ని రిమాండ్‌కు పంపినట్టు డీఎస్పీ అనిల్‌కుమార్‌ తెలిపారు. కేసును చేధించిన సీఐ మంగవేణి, ఎస్‌ఐలు నారాయణరావు, అశోక్‌కుమార్‌, ఏఎస్‌ఐలు త్రినాథ్‌రావు, కానిస్టేబుల్‌ షఫీలను అభినందించారు. 


Updated Date - 2021-10-14T05:14:06+05:30 IST