దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2021-10-17T05:53:16+05:30 IST

పగటిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను అరెస్టు చేసి, అతడి నుంచి 22 తులాలు బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సీఐ నరసింహరావు, ఎస్‌ఐ లింగన్న తెలిపారు.

దొంగ అరెస్టు


రూ.10 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం

కొత్తచెరువు, అక్టోబరు 16: పగటిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను అరెస్టు చేసి, అతడి నుంచి 22 తులాలు బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సీఐ నరసింహరావు, ఎస్‌ఐ లింగన్న తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీ్‌సస్టేషనలో అరెస్టు వివరాలను విలేకరులకు వెల్ల డించారు. ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లికి చెందిన భీమనేని అమర్‌నాథ్‌నాయుడు గ్రామాల్లో ట్రాక్టర్‌ డ్రైవర్‌ గా కూలిపనులు చేస్తానని నమ్మిస్తూ వారి వద్ద  ఉండేవాడు. పగటిపూట ఎవరెవరు ఇళ్లలో లేరో గమనించి, చోరీలు చేసేవాడు. కొత్తచెరువు, చెన్నేకొత్తపల్లి, పుట్టపర్తిరూరల్‌, గోరంట్ల, బత్తలపల్లి, రొద్దం తదితర మండలాల్లో 30కిపైగా ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. వీటిపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిందితుడు పుట్టపర్తి మండలం గంట్లమారెమ్మగుడి వద్ద ఉన్నట్టు కొత్తచెరువు పోలీసులకు సమాచారం రావటంతో ఎస్‌ఐ లింగన్న.. సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇతడిపై ఇప్పటికే 30కిపైగా కేసులున్నట్లు వివరించారు.


Updated Date - 2021-10-17T05:53:16+05:30 IST