Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యాదీవెన మూడో విడత రూ.49.34 కోట్లు జమ: కలెక్టర్‌

కర్నూలు(కలెక్టరేట్‌), నవంబరు 30: జిల్లాలో జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వం మూడో విడతలో 80,961 మంది తల్లుల ఖాతాలో రూ.49.34 కోట్లను జమ చేసిందని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. మంగళ వారం తాడేపల్లి తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యాదీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, పాణ్యం, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, సుధాకర్‌ రెడ్డి, నగర మేయర్‌ బీవై రామయ్య, జడ్పీ చైర్మన్‌ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఎంకేవీ శ్రీనివాసులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ ప్రతాప్‌ సూర్య నారాయణ రెడ్డి, బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వెంకటలక్ష్మి, డీఎస్‌డబ్ల్యూవో చింతామణి, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement