ముగిసిన నాచగిరి లక్ష్మీనృసింహస్వామి నవాహ్నిక బ్రహోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-13T05:30:00+05:30 IST

ముగిసిన నాచగిరి లక్ష్మీనృసింహస్వామి నవాహ్నిక బ్రహోత్సవాలు

ముగిసిన నాచగిరి లక్ష్మీనృసింహస్వామి నవాహ్నిక బ్రహోత్సవాలు
గర్భాలయంలో పూజలందుకుంటున్న లక్ష్మీనృసింహుడు, శతఘటాభిషేకం నిర్వహిస్తున్న వేద పండితులు

వర్గల్‌, ఏప్రిల్‌ 13 : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో స్వామివారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు మంగళవారం శతఘటాభిషేకంతో ముగిశాయి. ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఆలయ మండపంలో 108 కలశాలకు పూజలు నిర్వహించి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలతో పాటు ఆలయ మండపంలో హోమం, మంత్రపుష్పం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ శభ్నవీసు హన్మంతరావు నేతృత్వంలో శతఘటాభిషేకం నిర్వహించగా, సహాయ కమిషనర్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టం పూర్తి చేశారు. ఉత్సవాల ముగింపు, ఉగాది పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సంవత్సరమంతా శుభం కలగాలని మొక్కుకున్నారు. 

Updated Date - 2021-04-13T05:30:00+05:30 IST