Abn logo
Sep 25 2021 @ 21:45PM

కారుకు నిప్పంటించిన దుండగులు

నల్గొండ: భూ సర్వే కోసం వచ్చిన ఉద్యోగులకు చెందిన కారుకు దుండగులు నిప్పంటించారు. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప గ్రామ శివారులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రవేట్ కన్సల్టెన్సీ ఉద్యోగులు భూ సర్వే కోసం వచ్చారు. సర్వే కోసం ఉద్యోగులను  స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఉద్యోగులకు చెందిన కారుకు దుండగులు నిప్పంటించారు.  రూ.25 లక్షల విలువైన సర్వే సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి రూరల్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని  పోలీసులు విచారిస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...