Abn logo
Sep 22 2021 @ 23:21PM

పులుల గణన పకడ్బందీగా చేపట్టాలి

మాట్లాడుతున్న ఎఫ్‌డీపీటీ వినోద్‌కుమార్‌

-ఎఫ్‌డీపీటీ వినోద్‌కుమార్‌ 

జన్నారం, సెప్టెంబరు 22: పెద్ద పులుల గణనను పకడ్బందీగా చేపట్టాలని ఎఫ్‌డీపీటీ (ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ పాజెక్టు టైగర్‌) వినోద్‌కు మార్‌ ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న పెద్ద పులుల గణనలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని ఫారెస్టు టీడీసీలో  కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలోని అటవీశాఖ అధికారులతో పాటు వరంగల్‌, మెదక్‌, కరీంనగర్‌ సర్కిళ్లలోని అటవీరేంజ్‌, సెక్షన్‌ అధికారులకు శిక్షణ  తరగతులను నిర్వహించారు.  రెండు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో భాగంగా మొదటి రోజు ఎఫ్‌డీపీటీ వినోద్‌కుమార్‌ మాట్లాడా రు.  పెద్దపులుల గణనతో పాటు శాఖాహార, మాంసాహార జంతువుల గణనను చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా మొబైల్‌ యాప్‌ ద్వారా జంతుగణనను చేపట్టే విధానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ర్కీన్‌ ద్వారా ప్రదర్శించి అవగాహన కల్పించారు. రెండు రోజుల శిక్షణ అనంతరం అటవీ రేంజ్‌ అధికారులు వారి పరిధిలోని బీట్‌ ఆఫీసర్లకు శిక్షణ  ఇవ్వాలన్నారు. రెండు వారాల్లోగా టైగర్‌ జోన్‌లోని అన్ని రేంజ్‌ లలో పెద్ద పులులతోపాటు శాఖాహార జంతువుల గణన చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీఎఫ్‌వో శివానీడోంగ్రె, జన్నారం ఎఫ్‌డీవో మాధవరావు, రేంజ్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.