Abn logo
Sep 23 2021 @ 23:05PM

పులుల గణన పకడ్బందీగా చేపట్టాలి

అవగాహన కల్పిస్తున్న కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌

కవ్వాల్‌ టైగర్‌జోన్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌

జన్నారం, సెప్టెంబరు 23:  కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో పులుల గణన పకడ్బందీగా చేపట్టాలని కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు.  కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో చేపట్టే జాతీయ పులుల గణనపై ఎఫ్‌ ఆర్‌వో, ఎఫ్‌ఎస్‌వోలకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు గురువారం ముగిశాయి.  ఈ మేరకు ఉమ్మడి నిజామా బాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన ఎఫ్‌ఆర్‌వో, ఎఫ్‌ఎస్‌వోలకు  గురువారం  కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఎంస్ర్టిబ్‌ ఎకలాజికల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా శాఖహార, మాంసాహార జంతువుల గణన ఎలా చేపట్టాలో పవర్‌ ప్రజంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం స్ధానిక అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి శిక్షణలో భాగంగా ట్రాన్స్‌లేట్‌ టూ ట్రయల్‌పై  వివరించారు.  ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ అటవీ క్షేత్రాల్లో అధికారులు పూర్తిస్ధాయిలో జంతువుల గణనను పూర్తి చేయాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. జాతీయ పులుల గణనలో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులను  వివరించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల డీఎఫ్‌వో శివా నీడోంగ్రె, ఎఫ్‌డీవో మాధవరావు, అధికారులు ప్రణయ్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.