మళ్లీ విజృంభణ

ABN , First Publish Date - 2020-06-06T08:57:11+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా వైరస్‌ విస్తరిస్తూనే ఉంది.

మళ్లీ విజృంభణ

జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య 359

శుక్రవారం ఒక్కరోజే 22

జిల్లాలో 359కి చేరిన కొవిడ్‌-19 కేసులు

మామిడాడ మృతుడి ద్వారా అత్యధికంగా పెదపూడి మండలంలో 123 మందికి

శుక్రవారం 22 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

అయినవిల్లిలో ఓ రోగిని పరామర్శించడానికి వెళ్లిన 14 మందికి వైరస్‌ వ్యాప్తి

మామిడాడ మృతుడి ద్వారా మరో ఇద్దరికి సంక్రమణ

మామిడాడలో వివాహానికి, అత్తారింటికి వెళ్లొచ్చిన ఇద్దరికి రాయవరంలో పాజిటివ్‌

అటు విదేశాల నుంచి ఇప్పటివరకు స్వస్థలాలకు 900 మంది జిల్లావాసుల రాక

మరికొద్దిరోజుల్లో ఇంకో వెయ్యి మంది వరకు గల్ఫ్‌ నుంచి పయనం


(కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

జిల్లాలో కొవిడ్‌ కేసులు ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా వైరస్‌ విస్తరిస్తూనే ఉంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, గర్బిణీల వరకు బాధితులుగా మారు తూనే ఉన్నారు. కొద్దిరోజుల కిందటి వరకు విదేశాల నుంచి వచ్చినవారు, మర్కజ్‌, కోయంబేడు, కోల్‌కతా మార్కెట్‌ నేపథ్యం, ముంబై కేసులు ఇలా ఏదొక తీగ ద్వారా వైరస్‌ వ్యాపించి బాధితుల విషయంలో స్పష్టత కనిపించగా, ఇప్పుడు కొత్తగా నిర్ధారణ అవుతున్న పాజిటివ్‌ కేసుల్లో అసలు వైరస్‌ ఎవరి నుంచి వచ్చిందనేది కూడా వైద్యులకు అంతుపట్టడం లేదు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ద్వారా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ కింద పరీక్షలు చేసి బాధితులను ఇప్పటివరకు గుర్తించగా, ఇప్పుడు నిర్థారణ అవుతున్న కేసుల్లో బాధితులకు అసలు వైరస్‌ ఎలా వచ్చింది? వీరు ప్రైమరీయా, సెకండరీ కాంటాక్ట్స్‌ కిందకు వస్తా రా? అనేది కూడా స్పష్టంగా తేలడం లేదు.


మరోపక్క శుక్రవారం నాటి 22 పాజిటివ్‌ కేసులతో కలిపి జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య 359కి చేరింది. ఇందులో అత్యధికంగా మామిడాడ మృతుడి ద్వారా పెద పూడి మండలంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 123కి చేరింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ శాంపిళ్లు 53 వేల వరకు సేకరించారు. మరోపక్క ఇప్పటి వరకు విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి సంఖ్య 900 మందికి చేరింది. త్వరలో మరో వెయ్యి మంది వరకు గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ శాఖకు సమాచారం అందింది. 


అక్కడ మళ్లీ వరుస పెట్టాయి...

కోనసీమలోని అయినవిల్లి మండలంలో వరుస కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌ లో శస్త్రచికిత్స పూర్తిచేసుకుని మండలంలోని ఎన్‌.పెదపా లేనికి వచ్చిన ఓ వ్యక్తిని పెద్ద సంఖ్యలో స్థానికులు, అధికార పార్టీకి చెందిన మరికొందరు నేతలు కలిసి పరా మర్శించారు. దీంతో సదరు రోగి ద్వారా వైరస్‌ పలువురికి వ్యాపించింది. తాజాగా ఈయన నుంచి శుక్రవారం ఒక్క రోజే 14 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పాజి టివ్‌ వచ్చిన వారిలో వార్డు వలంటీర్‌ ఒకరున్నారు. మిగి లిన వారి వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోపక్క రాయవరం మండలం చెల్లూరులో రెండు పాజి టివ్‌లు ధ్రువీకరించారు. ఇందులో ఒక వ్యక్తి మామిడాడ లోని అత్తారింటికి గత నెల 8న వెళ్లి వచ్చాడు.


మరో మహిళ వివాహ శుభకార్యానికి గత నెల 13న వెళ్లి వచ్చారు. వీరిద్దరికి కొవిడ్‌ సోకింది. మామిడాడ కొవిడ్‌ మృతుడి ద్వారా అదే గ్రామంలో ఒకరికి, పెదపూడి మం డలం రాజుపాలెంలో మరో వ్యక్తికి వైరస్‌ వ్యాపించింది. బొమ్మూరు క్వారంటైన్‌లో ఇద్దరికి సోకగా, కరపలో ఒకరికి, అనపర్తి మండలం కుతుకులూరు, రామవరం గ్రామాల్లో ఇద్దరికి సోకినట్టు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్నట్టు తాజా కేసులు వెల్లడి స్తున్నాయి. ఈ కేసులు కోనసీమతోపాటు అనపర్తి, రాయ వరం, పెదపూడి మండలాల్లో తీవ్రత అధికంగా ఉంది.

Updated Date - 2020-06-06T08:57:11+05:30 IST