Abn logo
Sep 24 2021 @ 00:14AM

లక్షల్లో అయ్యే చికిత్స రూ.10 వేలకే!

  • ఎంఎ్‌సఎన్‌ ల్యాబ్స్‌ నుంచి మూత్రపిండాల కేన్సర్‌ ఔషధం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మూత్రపిండాల కేన్సర్‌ చికిత్స కోసం ఎంఎ స్‌ఎన్‌ ల్యాబ్స్‌ కొత్త ఔషధాన్ని విడుదల చేసింది. రెనల్‌ సెల్‌ కార్సినోమా చికిత్సకు ‘కాబోజెంటినిబ్‌’ ఔషధానికి జనరిక్‌ను ప్రవేశపెట్టామని, దేశంలో కాబోజెంటినిబ్‌నకు ఇదే తొలి బ్రాండెడ్‌ జనరిక్‌ అని కంపెనీ వెల్లడించింది. 20/40/60 ఎంజీ మోతాదుల్లో ఇది లభిస్తుంది. నెలకు అయ్యే ఖర్చు రూ.10 వేల కంటే తక్కువ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో దిగుమతి చేసుకున్న బ్రాండ్లను విక్రయిస్తున్నారు. వీటికి అయ్యే ఖర్చు రూ.లక్షల్లో ఉంది.


అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సొంత ప్లాంట్‌లో మూత్రపిండాల కేన్సర్‌ ఔషధాన్ని ఎంఎ్‌సఎన్‌ ల్యాబ్స్‌ తయారు చేస్తుంది. ‘అంకాలజీ ఒరిజినల్‌ మెడిసన్‌’ పేరుతో ఎంఎ్‌సఎన్‌ ల్యాబ్స్‌ కొత్తగా అంకాలజీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. బయో ఈక్వలెంట్‌ జనరిక్‌ అంకాలజీ ఔషధాలను అందించడంపై ఈ విభాగం దృష్టి కేంద్రీకరిస్తుంది.