సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

ABN , First Publish Date - 2021-06-24T01:45:20+05:30 IST

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్, వాన్‌పిక్ ఛార్జ్‌షీట్లపై విచారణ కొనసాగింది. ఇందూ టెక్​జోన్ కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్ బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని కోర్టును బీపీ ఆచార్య కోరారు. తదుపరి విచారణ నాటికి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలుకు జగన్‌ గడువు కోరారు. డిశ్చార్జ్‌ పిటిషన్ల దాఖలుకు విజయసాయిరెడ్డి, కార్మెల్ ఏషియా కంపెనీ సమయం కోరారు. జగన్, విజయసాయిరెడ్డి వినతితో కోర్టు ఏకీభవించింది. దీంతో  జూలై 1కి విచారను కోర్టు వాయిదా వేసింది. 


రఘురాం సిమెంట్స్ కేసులో వాదనలకు వీడీ రాజగోపాల్ సమయం కోరారు. ఈ ఛార్జ్‌షీట్‌పై విచారణను కోర్టు జూలై 1కి వాయిదా వేసింది. పెన్నా సిమెంట్స్ కేసు అభియోగాల నమోదుపై జగతి పబ్లికేషన్స్ వాదనలు వినిపించింది. వాదనల కొనసాగింపు కోసం విచారణ రేపటికి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్, వాన్‌పిక్ ఛార్జ్‌షీట్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది.

Updated Date - 2021-06-24T01:45:20+05:30 IST