సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ

ABN , First Publish Date - 2021-08-24T01:41:17+05:30 IST

సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ కేసులపై విచారణ జరిగింది. ఈడీ కేసులను మొదట

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్  కేసుల విచారణ

హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ కేసులపై విచారణ జరిగింది. ఈడీ కేసులను మొదట విచారణ జరపాలన్న నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈడీ కేసులు మొదట విచారణ జరపాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే వరకు ఈడీ కేసులను వాయిదా వేయాలని విజయసాయి కోరారు. ఈడీ కేసుల విచారణ సెప్టెంబరు 1కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.  


ఇందూ టెక్ జోన్ కేసులో మంత్రి సబిత డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్‌ వేసింది. సబితా ఇంద్రారెడ్డిని ఇందూ టెక్ జోన్ కేసు నుంచి తొలగించవద్దన్న సీబీఐ కోరింది. సబిత ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. పెన్నా కేసు నుంచి తొలగించాలన్న జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ జరిగింది. జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది.  

Updated Date - 2021-08-24T01:41:17+05:30 IST