తెగ తాగేశారు

ABN , First Publish Date - 2021-10-17T05:23:24+05:30 IST

జిల్లాలో దసరా సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. తెలంగాణ బేవరేజెస్‌ కార్పోరేషన్‌ ద్వారా జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెట్టిపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో ఈ నెల 14వ తేదీ వరకు రూ. 14. 20 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.

తెగ తాగేశారు
లోగో...

- దసరాకు కళకళలాడిన మద్యం దుకాణాలు

-జిల్లాలో-రూ. 14 కోట్లకు పైగా అమ్మకాలు నమోదు

మంచిర్యాల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దసరా సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. తెలంగాణ బేవరేజెస్‌ కార్పోరేషన్‌ ద్వారా జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెట్టిపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో ఈ నెల 14వ తేదీ వరకు రూ. 14. 20 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నాలుగు సర్కిళ్ల పరిధిలో మొత్తం 16,032 కేసుల లిక్కర్‌ అమ్మకాలు నమోదు కాగా, 19,989 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల్లో మంచిర్యాల సర్కిల్‌ పరిధిలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు నమోదయ్యా యి. మంచిర్యాల సర్కిల్‌లో రూ. 5. 92 కోట్ల విలువగల 6519 కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరుగగా బెల్లంపల్లి సర్కిల్‌ పరిధిలో రూ. 4. 42 కోట్ల విలువైన 5,065 కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. అలాగే చెన్నూర్‌ సర్కిల్‌ పరిధిలో రూ. 1. 35 కోట్ల విలువగల 1,887 కేసులు అమ్మగా లక్షెట్టిపేట సర్కిల్‌ పరిధిలో రూ. 2. 50 కోట్ల విలువైన 2571 కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే బీర్ల అమ్మకాలు సైతం గణనీయంగా నమోదయ్యాయి. మంచిర్యాల సర్కిల్‌ పరిధిలో 8,098 కేసుల బీర్లు అమ్మకాలు నమోదుకాగా బెల్లంపల్లి సర్కిల్‌ పరిధిలో 5,986 కేసుల విక్రయాలు జరిగాయి. చెన్నూర్‌ సర్కిల్‌ పరిధిలో 1,304 కేసుల బీర్లు అమ్ముడుపోగా లక్షెట్టిపేట సర్కిల్‌లో 4601 కేసుల బీర్లు విక్రయాలు నమోదయ్యాయి. 

పెరిగిన బీర్ల అమ్మకాలు..

మద్యం అమ్మకాల్లో లిక్కర్‌తో పోల్చితే ఈ సారి బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగాయి. దసరా పండుగను పురస్కరించుకొని యువత బీర్లపై మక్కువ కనబర్చడంతో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో 19,989 కేసుల బీర్ల విక్రయాలు జరగడంతో దసరా పండుగను యువత మస్తుగా ఎంజాయ్‌ చేసినట్లు తెలుస్తోంది. బీర్ల కొనుగోలు చేసిన వారిలో అధిక శాతం యువతే ఉన్నట్లు మద్యం వ్యాపారులు చెబుతున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని లిక్కర్‌ అమ్మకాల్లో సింహభాగం బ్రాండెడ్‌ మద్యం కొనుగోలుకే ప్రజలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-10-17T05:23:24+05:30 IST