తెలంగాణ గొంతు వినిపించేందుకే పోటీ

ABN , First Publish Date - 2020-10-21T06:11:32+05:30 IST

నిరుద్యోగుల సమస్యలు, ప్రజల బాధలను చట్టసభలో తెలంగాణ గొంతుకగా వినిపించేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌

తెలంగాణ గొంతు వినిపించేందుకే పోటీ

లక్ష్యలను మరిచిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ఎన్నికలు పాలకుల అహంభావానికి, ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న సంఘర్షణ

టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కొదండరామ్‌


ఖమ్మం మయూరిసెంటర్‌, అక్టోబరు 20: నిరుద్యోగుల సమస్యలు, ప్రజల బాధలను చట్టసభలో తెలంగాణ గొంతుకగా వినిపించేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం జయశంకర్‌ ఆదేశం మేరకు చేస్తున్న పోరాటాలకు ఎన్నికలు కొనసాగింపు మాత్రమే అన్నారు. నాటి నుంచి నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ అస్థిత్వ పరిరక్షణకు పోరాడుతున్నామన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, పాలకుల అహంభావానికి, ప్రజల ఆత్యగౌరవానికి మధ్య జరుగుతున్న సంఘర్షణగా ఆయన అభివర్ణించారు.


ప్రభుత్వం చిత్తశుద్ధితో అవినితి లేకుండా కల్వకుర్తి పంపుహౌస్‌ నిర్మించి ఉంటే అది కూలేది కాదన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తనను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో టీజేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి శ్రీనివాస్‌రావు, గోపగాని శంకర్‌రావు, రాయప్ప, జిల్లా ఎన్నికల పరిశీలకుడు మేకపోతుల నర్సయ్య, జిల్లా అద్యక్ష కార్యదర్శులు శీలం పాపారావు, వర్దెబోయిన బాబు, రవి, వెంకన్న, సూర్యకిరణ్‌, శ్రీనివాసరావు, నాగలక్ష్మి ప్రసాద్‌  ఉన్నారు. 

Updated Date - 2020-10-21T06:11:32+05:30 IST