సీఎంకు కొత్త అర్థం చెప్పిన టీఎంసీ

ABN , First Publish Date - 2021-09-12T01:00:28+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి ముందే ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ..

సీఎంకు కొత్త అర్థం చెప్పిన టీఎంసీ

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి ముందే ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై విమర్శలు గుప్పించింది. సీఎం అనే పదానికి 'చెయిర్స్ మ్యూజికల్' (కుర్చీలాట) అనే కొత్త అర్థం టీఎంసీ చెప్పింది. సీఎం పదవిని చైర్స్ మ్యూజికల్‌‍గా 'ఆ ఇద్దరూ' భావిస్తున్నారంటూ టీఎంసీ సీనియర్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ మోదీ, అమిత్‌షాలను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. కాగా, గుజరాత్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తాను స్వచ్ఛందంగానే రాజీనామా సమర్పించినట్టు విజయ్ రూపానీ తన రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ సైతం స్పందించింది. ప్రజలే బీజేపీని అధికారం నుంచి తప్పించాలని అనుకుంటున్నారని, గ్రామాలు, పేద ప్రజలు, రైతుల గోడు వినే ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొంది.

Updated Date - 2021-09-12T01:00:28+05:30 IST