నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-23T03:44:41+05:30 IST

నిరుద్యోగ యువత అందివచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆశ్ర మపాఠశాలలో శనివారం తెలంగాణ స్టేట్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ఎడ్యుకేషన్‌, ఉపాధి కల్పనశాఖ సంయుక్తంగా నిర్వహించిన జాబ్‌ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

- అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, జనవరి 22: నిరుద్యోగ యువత అందివచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆశ్ర మపాఠశాలలో శనివారం తెలంగాణ స్టేట్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ఎడ్యుకేషన్‌, ఉపాధి కల్పనశాఖ సంయుక్తంగా నిర్వహించిన జాబ్‌ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువ తను దృష్టిలో ఉంచుకొని జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని జాబ్‌ మేళాలు ఏర్పాటు చేయనున్నట్లు దీని కోసం ఇప్పటికే పలు కంపెనీలను సంప్రదించినట్లు తెలిపారు. కంపె నీలు కోరుకుంటున్న నైపుణ్యాలు అభివృద్ధి చేసుకో వాలని తెలిపారు. జిల్లా అభివృద్ధి సాధంచాలంటే నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించడం ఒక్కటే మార్గమన్నారు. జాబ్‌మేళాకు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కార్యక్రమంలో డీఆర్డీఏ సురేందర్‌, ఉపాధికల్పన శాఖాధికారి రవికృష్ణ, టీఎస్‌ ఎస్‌ఈ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌, సంస్థసభ్యులు దీపక్‌, జీవన్‌, హఫీజ్‌, దినేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T03:44:41+05:30 IST