సంయుక్త విచారణ త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-10-23T06:24:02+05:30 IST

అటవీ భూముల సంరక్ష ణ కోసం నిర్వహిస్తున్న అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త విచారణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో ఫారెస్టు ప్రొటెక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

సంయుక్త విచారణ త్వరగా పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 22:  అటవీ భూముల సంరక్ష ణ కోసం నిర్వహిస్తున్న అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త విచారణ త్వరగా పూర్తిచేయాలని  కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో ఫారెస్టు ప్రొటెక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్టు ప్రొటెక్షన్‌ గురించి రెవెన్యూ, ఫారెస్టు జాయింట్‌ ఇన్ష్‌పెక్షన్‌ చాలా వరకుపూర్తయిందని మిగిలి ఉన్న దానిని తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలప స్మగ్లింగ్‌ కంట్రోల్‌పైన, ఫారెస్టు, రెవెన్యూ ల్యాండ్స్‌ భూముల విషయంలో క్లారిటి రావాలన్నారు. ఫారెస్టు గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారంగా రికార్డులను సరిచూసుకోవాలని అధికారులను సూచించారు. క్లారిటిగా ముందుకెళ్లాలంటే ముందుగా మనం క్లారిటిగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వో సునిల్‌, అడిషనల్‌ కలెక్టర్‌లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, ట్రైనీ కలెక్టర్‌ మఖరంద్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నేడు సీఎంతో సమావేశానికి కలెక్టర్‌, డీఎఫ్‌వో

నేడు కలెక్టర్‌ల సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. సీఎం కేసీఆర్‌ ఆధ్వ ర్యంలో ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశానికి కలెక్టర్‌ నారాయణరెడ్డి, డీఎఫ్‌వో సునీల్‌ హీరామత్‌లు హాజరవుతున్నారు. పలు అంశాలపైన సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌లతో చర్చించనున్నారు. ముఖ్యంగా పోడు భూములు, అటవీ భూముల సమస్యలు, గిరిజనుల సమస్యలపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

Updated Date - 2021-10-23T06:24:02+05:30 IST