వ్యాక్సిన్‌ వచ్చేసింది

ABN , First Publish Date - 2021-01-16T05:04:00+05:30 IST

ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

వ్యాక్సిన్‌ వచ్చేసింది

 నేడు కేంద్రాల్లో 420 మందికి టీకా 

18 నుంచి 99 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

 తొలివిడతలో 26,876 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు 

 ఉమ్మడి జిల్లాకు చేరిన 401 కోవీషీల్డ్‌ వాయిల్స్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శనివారం కరోనా  వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పనిచేసిన వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆశా వర్కర్లు, అం గన్‌వాడీ కార్యకర్తలు, ప్రైవేట్‌ ఆసుపత్రుల సిబ్బంది, డా క్టర్లకు తొలి విడతలో టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 16న లాంఛనంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 14 కేంద్రాల్లో టీకా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున 420 మం దికి టీకాలు ఇస్తారు.  కరీంనగర్‌ జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రి, హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రి, బుట్టిరాజారాం కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, తిమ్మాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 

పెద్దపల్లి జిల్లాలో జిల్లా ఆసుపత్రితోపాటు సుల్తానాబాద్‌ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌, గోదావరిఖని ఏరియా ఆసుపత్రి, లక్ష్మీపూర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో, రాజ న్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రితోపాటు వేములవాడ, ఇల్లం తకుంట, తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో, జగిత్యాల జిల్లాలో జగిత్యాల ఏరియా ఆసుపత్రి, కో రుట్ల క మ్యూని టీ హెల్త్‌ సెంటర్‌లో టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అనంతరం రా ష్ట్రంలో టీకాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెనువెంటనే జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంత్రి గంగుల కమలాకర్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో, బుట్టిరాజారాం కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెం టర్‌లో టీకాలు ఇచ్చే కార్యక్రమానికి హాజరవుతారు. తి మ్మాపూర్‌లో శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌, హు జురాబాద్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ ఈ కా ర్యక్రమాలకు హాజరవుతారు. నాలుగు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల్లో ఆయా ప్రాంత ఎమ్మె ల్యేలు కార్యక్రమానికి హాజరై పర్యవేక్షిస్తారు. తిరిగి 18న ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. కరీంనగర్‌ జిల్లాలో 12,419 మందికి, పెద్దపల్లి జిల్లాలో 6,860 మందికి, జగిత్యాల జిల్లాలో 4,115 మందికి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,482 మందికి మొత్తం నాలుగు జిల్లాల్లో కలిపి 26,876 మందికి తొలి విడతలో టీకాలు ఇవ్వనున్నారు. 


 జిల్లాలకు చేరిన కొవీషీల్డ్‌ టీకా


రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు తొలివిడత వేయడానికి కొవీషీల్డ్‌ టీకా కేటాయించారు. కరీంనగర్‌కు 154, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 128, జగిత్యాల జిల్లాకు 84,  పెద్దపల్లి జిల్లాకు 35 వ్యా క్సిన్‌ వాయిల్స్‌ను పంపించారు. ఆయా టీకా కేంద్రాల్లో వీటిని కోల్డ్‌ చైన్‌లో భద్రపరిచారు. ఒక్కో వాయిల్‌లో 10 మందికి సరిపోయే టీకా మందు ఉంటుంది. విడతల వారీగా వ్యాక్సిన్‌ను ఏరోజుకారోజు జిల్లాలకు సరఫరా చేస్తారు. కోవిన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్లు తమకందిన సెల్‌ సమాచారం మేరకు గుర్తింపు కార్డును తీసుకొని నిర్దేశిత టీకా కేంద్రానికి రావాల్సి ఉంటుంది. వారి వివరాలను పరిశీలించిన తర్వాత వ్యాక్సిన్‌ ఇస్తారు. టీకాలు తీసుకున్నవారిని అర గంటపాటు ఆయా కేంద్రాలలోనే అబ్జర్వేషన్‌లో ఉంచు తారు. టీకా తీసుకున్న తర్వాత ఆరోగ్యపరమైన ఇబ్బం దులు తలెత్తితే కరీంనగర్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రికి, హుజురాబాద్‌ ఏరియా ఆసుపత్రికి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి, వేములవాడ ఆసుపత్రి, పెద్దపల్లి జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి, గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి, జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి, మెట్‌పల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించి చికిత్సనందిస్తారు. ఆయా కేంద్రా ల్లో ప్రత్యేక వైద్యులను అందుకోసం నియమించారు. అన్ని జిల్లాల్లో అడ్‌వర్స్‌ ఈవెంట్‌ ఫాలోయింగ్‌ ఇమ్యూనైజేషన్‌(ఏఈఎఫ్‌ఐ) టీంలను ఏర్పాటు చేశారు. 


18 నుంచి 99 కేంద్రాల్లో...


ఈ నెల 18న నాలుగు జిల్లాల పరిధిలో 99 కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో రోజుకు వందమంది చొప్పున టీకాలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రి, జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రితోపాటు కరీంనగర్‌ పట్టణంలోని 6 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, జిల్లాలోని 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు ఇస్తారు. అలాగే జగిత్యాల జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రితోపాటు 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలు, రెండు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, జగిత్యాల సివిల్‌ డిస్పెన్షనరీలో, పెద్దపల్లి జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రి, సుల్తానాబాద్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, గోదావరిఖని ఏరియా ఆసుపత్రితోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు కలుపుకొని 26 కేంద్రాల్లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రి, 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో టీకాల కార్యక్రమం చేపట్టనున్నారు. 

Updated Date - 2021-01-16T05:04:00+05:30 IST