వ్యాక్సిన్‌కు వేగంగా అనుమతులివ్వాలి

ABN , First Publish Date - 2020-08-07T07:04:56+05:30 IST

వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారతదేశం... అన్ని దేశాలూ వ్యాక్సిన్ల మీద దృష్టి కేంద్రీకరించిన ప్రస్తుత పరిస్థితుల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే అనుమతుల ప్రక్రియను మరింత సరళీకరించి, వికేంద్రీకరించడం ద్వారా వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల

వ్యాక్సిన్‌కు వేగంగా అనుమతులివ్వాలి

  • కొనుగోళ్లు, లైసెన్సుల మార్గదర్శకాలివ్వండి
  • అప్పుడే అందరికీ వ్యాక్సిన్‌ సాధ్యమవుతుంది
  • వ్యాక్సిన్‌ కంపెనీలకు మరిన్ని నిధులివ్వండి
  • త్వరలోనే మార్కెట్లోకి హైదరాబాద్‌ వ్యాక్సిన్‌
  • కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు కేటీఆర్‌ లేఖ


హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారతదేశం... అన్ని దేశాలూ వ్యాక్సిన్ల మీద దృష్టి కేంద్రీకరించిన ప్రస్తుత పరిస్థితుల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే అనుమతుల ప్రక్రియను మరింత సరళీకరించి, వికేంద్రీకరించడం ద్వారా వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. తెలంగాణలో జరుగుతున్న వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రయత్నాలను కేటీఆర్‌ తన లేఖలో వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ప్రపంచానికి వ్యాక్సిన్‌ క్యాపిటల్‌లా ఉందని చెప్పారు. ఏటా ఇక్కడి నుంచే 5 బిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ తయారవుతోందని, ప్రపంచ ఉత్పత్తిలో ఇది మూడింట ఒక వంతుతో సమానమని తెలిపారు. నగరానికి చెందిన 3 కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ తయారీ ప్రయత్నాలు చేస్తున్నాయ ని చెప్పారు. అందులో ఒక కంపెనీ నుంచి త్వరలో కరోనా వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి వస్తుందన్నారు. ఇది తనకు గర్వంగా ఉందన్నారు. వాక్సిన్‌ తయారీ కం పెనీలు, సంస్థలకు ప్రభుత్వ సహకారం, అందరికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడం వంటి అంశాలను కేటీఆర్‌ తన లేఖలో ప్రస్తావించారు. వ్యాక్సిన్‌ తయారీలో ముందు వరుసలో ఉన్న క ంపెనీలకు మరింత ఫండింగ్‌ ఇచ్చేలా నూతన నిధిని ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ కోరారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే భారత్‌ తన అగ్రస్థానం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించా రు. తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర అధికారులు, పరిశ్రమ వర్గాలతో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఇతర ఫార్మా కంపెనీలు సైతం కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సిక్లోరోక్విన్‌, ఫెవిపిరావిర్‌ వంటి మందుల తయారీలో పాలు పంచుకుంటున్నాయన్నారు. బయోటెక్‌ పరిశ్రమ వర్గాలతో గతవారం సమావేశం ఏర్పాటు చేశానని కేటీఆర్‌ చెప్పారు. దేశీయంగా బయోటెక్‌ పరిశ్రమలను మరిం త ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు, బయోటెక్‌ రం గంలో భారత్‌ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఉన్న అవకాశాలను, తీసుకోవాల్సిన చర్యలను కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు. వ్యాక్సిన్‌ అనుమతులు, టెస్టింగ్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను మరింత వికేంద్రీకరించాలని కోరా రు. అప్పుడు క్లినికల్‌ ట్రయల్స్‌, వ్యాక్సిన్‌ తయారీలో కంపెనీలు మరింత సులభంగా ముందుకు వెళ్లేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండింగ్‌ అవసరమని సూచించారు. సెంట్రల్‌ డ్రగ్‌ లాబరేటరీ హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో ఉందని, బ్రిటీష్‌ పాలన కాలంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఇప్పటికీ అక్కడే కొనసాగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఇతర బయోటెక్‌ కంపెనీలకు ఇబ్బందిగా మారిందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణ సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల సెంట్రల్‌ డ్రగ్‌ లాబరేటరీకి శాంపిళ్లను పంపించడానికి బయోటెక్‌ పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయని వివరించారు. మరింత వేగంగా వ్యాక్సిన్‌ తయారు చేసే ఉద్దేశంతో పని చేస్తున్న కంపెనీలకు కొంత సులభంగా అనుమతులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. కేంద్రం ఇప్పటికే కొన్ని వికేంద్రీకరణ చర్యలతో సీడీఎ్‌ససీవో జోనల్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పట్ల కే టీఆర్‌ హర ్షం వ్యక్తం చేశారు. జోనల్‌ కార్యాలయానికి మరిన్ని అధికారాలు, నిధులు ఇచ్చి బలోపేతం చేయాలని కోరారు. వ్యాక్సిన్ల తయారీలో 6 కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుమతులు ఇవ్వాల్సి ఉం టుందని, రాష్ట్ర స్థాయిలోనూ అనుమతులు పొందాల్సి ఉందని కేటీఆర్‌ చెప్పారు. ప్రపంచ పోటీ తత్వాన్ని తట్టుకోవాలంటే వ్యాక్సిన్‌అనుమతి సులభంగా లభించే నూతన విధానానికి రూపకల్పన చేయాలని కోరారు. వ్యాక్సిన్‌ లైసెన్సింగ్‌కు సంబంధించి డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగా దేశీయంగా మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. క్లినికల్‌ ట్రయల్స్‌, వ్యాక్సిన్‌ తయారీ మీద కూడా కేటీఆర్‌ సూచనలు చేశారు. రెండు కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉన్నాయన్నారు. కంపెనీలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చే సి, విజయవంతంగా ప్రయోగ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. త్వరలోనే వ్యాక్సిన్‌ వస్తుం దన్న నమ్మకం ఏర్పడుతున్నందున కొనుగోలు విధానాన్ని కూడా సిద్ధం చేయాలని సూచించారు. వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. పీఎం కేర్స్‌ ద్వారా రూ.100 కోట్లను వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలకు కేటాయించారని, వాటి వినియోగం మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సూచించారు. 


బయోటెక్‌లో 4 లక్షల ఉద్యోగాలు

రానున్న రోజుల్లో లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమల రంగంలో 50 - 100 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించి అద నంగా 4 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ అన్నారు. పునర్వ్యవస్థీకరించిన లైఫ్‌ సైన్సెస్‌ సలహా కమిటీ మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. జీనోమ్‌ వ్యాలీ, మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌, హైదరాబాద్‌ ఫార్మా సిటీలతో హైదరాబాద్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్టు చెప్పారు.  


కమిటీ చైర్మన్‌గా సతీశ్‌రెడ్డి

పునర్వవస్థీకరించిన లైఫ్‌ సైన్సెస్‌ సలహా మండలి చైర్మన్‌గా రెడ్డి లాబ్స్‌ చైర్మన్‌ సతీ్‌షరెడ్డిని నియమించింది. బయోలాజికల్‌- ఇ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్ల వైస్‌ చైర్మన్‌గా, తెలంగాణ ప్రభుత్వ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వానికి, పరిశ్రమలకు, విద్యాసంస్థలకు మధ్య ఈ కమిటీ అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. 2016లో ప్రొఫెసర్‌ బాలసుబ్రమణ్యం చైర్మన్‌గా ఏర్పడిన తొలి కమిటీ ప్రభుత్వానికి పలు కీలకమైన సలహాలు అందించింది.

Updated Date - 2020-08-07T07:04:56+05:30 IST