అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-09-17T06:15:13+05:30 IST

జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలి
వెబ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి

- జగిత్యాల కలెక్టర్‌ రవి

జగిత్యాల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు. గురువారం పట్టణంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రవి మా ట్లాడారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్‌ వేయించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 140 సబ్‌ సెంట ర్లు ఉన్నాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో 134 వార్డులలో 134 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రంలో ప్రతీ రోజు కనీసం 100 మందికి కొవిడ్‌ టీకాలను అందించాలన్నారు. జిల్లాలో ఉన్న 274 వ్యాక్సినే షన్‌ కేంద్రాల ద్వారా రోజుకు 27,400 టీకాలకు తక్కువ కాకుండా వేయాలన్నారు. వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారు తప్పకుండా వెంట వారి సెల్‌ఫోన్‌, ఆధార్‌ కార్డు తీసుకొని రావాలని సూచించారు. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీధర్‌తో పాటు పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.

ప్రతి ధరఖాస్తును సమగ్రంగా పరిశీలించాలి

వివిధ సమస్యల పరిష్కారం కొరకు తహసీ ల్దార్ల వద్దకు వచ్చే ప్రతి ధరఖాస్తును సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్‌ గుగులోతు రవినాయక్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాల యం నుంచి వివిధ రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్ధార్లతో జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ రవి మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ల కొరకు వచ్చే ప్రతి దరఖాస్తులను త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్‌ ప్రకారం ధరఖాస్తులపై తుది కార్యాచరణ చేపట్టి లబ్ధిదారులకు అందించాలన్నారు. సాంకే తిక సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుక వెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. అర్హత మేరకు మాత్రమే లబ్ధి చేకూర్చాలన్నారు. గడువు దాటిపో యిన, వివిధ రకాల సర్టిఫికెట్లు, సర్వే కొరకు వచ్చిన పిటిషన్లపై సర్వే చేయించి త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణ జరగకుండా జాగ్రత్తలు వహించాల న్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల ఆర్డీఓలు మాధురి, వినోద్‌ కుమార్‌లతో పలు వురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T06:15:13+05:30 IST