దేశప్రజలను కాదని వ్యాక్సిన్‌ ఎగుమతి చేయలేదు

ABN , First Publish Date - 2021-05-19T07:57:34+05:30 IST

దేశ ప్రజల అవసరాలను కాదని తాము వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేయలేదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది

దేశప్రజలను కాదని వ్యాక్సిన్‌ ఎగుమతి చేయలేదు

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా


న్యూఢిల్లీ, మే 18: దేశ ప్రజల అవసరాలను కాదని తాము వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేయలేదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశ ప్రజల ప్రయోజనాలు తమకు ముఖ్యమని పేర్కొంది. దేశంలో వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు తమ మద్దతు ఉంటుందని, అవకాశం ఉన్నమేరకు ఏం కావాలంటే అది చేయడానికి తాము కట్టుబడి ఉ న్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్‌ ఎగుమతి విషయంలో ప్రభుత్వం, తయారీ సం స్థలపై వచ్చిన విమర్శలకు ఎస్‌ఐఐ స్పందించింది.   


టీకాలపై సీరం మాట నిలబెట్టుకోవాలి: డబ్ల్యూహెచ్‌వో

భారత్‌లో కరోనా కల్లోలం సద్దుమణిగిన తర్వాత సీరం ఇనిస్టిట్యూట్‌...టీకా ల పంపిణీపై కొవ్యాక్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ మీడియా సమావేశం లో ఈ విషయం గుర్తు చేశారు.  ప్రపంచ దేశాలలో కొవిడ్‌-19 కేసులు గణనీయంగాపెరిగిపోవడంతో టీకా సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయని టెడ్రోస్‌ తెలిపారు. జూన్‌ చివరికల్లా కొవ్యాక్స్‌కు దాదాపు 19 కోట్ల డోసుల లోటు ఏర్పడుతుందని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-05-19T07:57:34+05:30 IST