విశాలతత్వం తెలుగు భాష సొంతం

ABN , First Publish Date - 2021-08-02T04:58:21+05:30 IST

విశాలతత్వం తెలుగు భాష సొంతమని రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్‌ప ర్సన్‌ నందమూరి లక్ష్మీపా ర్వతి అన్నారు.

విశాలతత్వం తెలుగు భాష సొంతం
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న లక్ష్మీపార్వ

  రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి 

శ్రీకాకుళం, ఆంధ్ర జ్యోతి/ గుజరాతీపేట: విశాలతత్వం తెలుగు భాష సొంతమని రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్‌ప ర్సన్‌ నందమూరి లక్ష్మీపా ర్వతి అన్నారు.  శ్రీకాకుళం నగరంలో ఆదివారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలుగు భాష సంస్కృ తాన్ని ఇమిడ్చుకుందని.. తద్వారా రెండు భాషలు విలీన మైపోయాయని చెప్పారు. భాష నిరంతర ప్రవాహమన్నారు. సంస్కృతులు, సంప్రదాయాలను కలుపుకొని సాగే గుణం తెలుగు భాషకు ఉందని తెలిపారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడు తూ, రచయితలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వారికి మంచి స్థానం కల్పించాల న్నారు. కార్యక్రమంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి ఆచార్య లజపతిరాయ్‌, సీనియర్‌ పాత్రికేయుడు నల్లి ధర్మారావు, ఏపీఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, రచయితలు లోకనాథం, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఫ నగరంలోని శాంతా కల్యాణ అనురాగ నిలయాన్ని ఆదివారం లక్ష్మీపార్వతి సందర్శించారు. చిన్నారులకు పెన్నులు, అట్టలు పండ్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఏడీ రమేష్‌, రెడ్‌క్రాస్‌ సభ్యులు మూర్తి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-08-02T04:58:21+05:30 IST