పల్లెభాష యాస ఎంతో గొప్పది

ABN , First Publish Date - 2022-03-06T05:26:25+05:30 IST

సమాజంలో పల్లె భాష అన్నా, యాస అన్నా ఎంతో గొప్పదని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

పల్లెభాష యాస ఎంతో గొప్పది
వేముల ఉన్నత పాఠశాలలో పల్లె భాష పుస్తకావిష్కరణ చేస్తున్న దేశపతి శ్రీనివాస్‌

- ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌ 


మూసాపేట, మార్చి 5: సమాజంలో పల్లె భాష అన్నా, యాస అన్నా ఎంతో గొప్పదని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మండల పరిధి లోని వేముల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పల్లెర్ల రామ్మోహనరావు రచించిన పల్లె భాష పుస్తకాన్ని శనివారం పాఠశాల ఆవరణలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ భాష కు మూలాలు పల్లె ప్రాంతాల్లో కష్టజీవుల నుంచి వచ్చినవే పల్లె భాష అని తెలిపారు. పల్లెర్ల రామ్మోహనరావు వేముల గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులచే తెలుగు పదా లను సేకరించి పల్లె భాష అనే పుస్తకాన్ని రచించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా పుస్తక సంపాదకులు రామ్మోహనరావు, పాఠశాల హెచ్‌ఎం శ్రీనువాసు లును దేశపతి అభినం దించారు. కార్యక్రమంలో స్వరాలహరి అకాడమీ చైర్మన్‌ బాగన్నగౌడ్‌, సర్పంచ్‌ అరుణ, ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ, శ్రీరామ ప్రింటర్‌ యజమాని శ్రీశైలం, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామ స్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T05:26:25+05:30 IST