మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాధితుడు

ABN , First Publish Date - 2020-10-24T11:30:13+05:30 IST

ఇటీవల జరిగిన కుటుంబ తగాదాలో తమ ప్రమేయం లేకున్నా పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని ధర్మారానికి చెందిన దుపాకి నరేందర్‌ మానవహక్కుల సంఘాన్ని శుక్రవారం ఆశ్రయించారు

మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాధితుడు

గీసుగొండ, అక్టోబరు 23: ఇటీవల జరిగిన కుటుంబ తగాదాలో తమ ప్రమేయం లేకున్నా పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని ధర్మారానికి చెందిన దుపాకి నరేందర్‌ మానవహక్కుల సంఘాన్ని శుక్రవారం ఆశ్రయించారు. క్రాంతి, మహేష్‌లు ఘర్షణ పడి కొట్టుకుంటుంటే వారిని నివారించేందుకు ప్రయత్నించానని నరేందర్‌ వాపోయాడు. ప్రత్యక్షసాక్షిగా ఉన్న తనపై ఎఫ్‌ఐఆర్‌లో ఏ4 నిందితుడిగా ఎస్‌ఐ అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. క్రాంతి పిటీషన్‌లో తన పేరు కూడా లేదన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు నరేందర్‌ వివరించారు.  

Updated Date - 2020-10-24T11:30:13+05:30 IST